ఇంత మంచి కాన్సెప్ట్‌ను ఇలా చేశావేంటన్నా?
I'm Game Movie Review: దుల్కర్ సల్మాన్ హీరోగా, నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త యాక్షన్ డ్రామా 'ఐమ్ గేమ్'. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చేతి మార్పిడి అనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
స్టోరీ
కథానాయకుడు(దుల్కర్ సల్మాన్) ఓ ప్రమాదంలో తన చేతిని కోల్పోతాడు. వైద్యులు అతనికి మరో వ్యక్తి చేతిని అమర్చి హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు. అయితే ఆ కొత్త చేయి ఓ రివేంజ్ స్టోరీ(పగ) బ్యాక్‌డ్రాప్ నుంచి వచ్చి ఉంటుంది. ఆ చేయి వల్ల దుల్కర్ సల్మాన్ జీవితంలో ఎదురైన అడ్డంకులు ఏమిటి? దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటనేదే 'ఐమ్ గేమ్' సినిమా కథాంశం.

విశ్లేషణ
సినిమా ప్రారంభ సన్నివేశం చేతి కాన్సెప్టును పరిచయం చేస్తూ ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ మాస్ ఎంట్రీ, జూదానికి అలవాటు పడటం, క్రికెట్ బెట్టింగ్, అప్పులు, తల్లిదండ్రులతో సన్నివేశాలు అంతా రొటీన్ ఫార్మాట్లోనే సాగుతాయి. ప్రమాదం జరగడం, హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంట్ పూర్తి కావడం, ఆపై లవ్ ట్రాక్, పాటతో కథ నెమ్మదిగా సాగుతుంది. అయితే ఇంటర్వెల్ కు 20 నిమిషాల ముందు నుంచి కథలో వేగం పెరుగుతుంది. కొత్త చేయి దుల్కర్ సల్మాన్‌కు సమస్యలు తెచ్చిపెట్టడం, విలన్ ఎంట్రీతో ఇంటర్వెల్ పర్వాలేదనిపస్తుంది.
ఫస్టాఫ్‌లో ఉన్న కాస్త ఆసక్తి సెకండాఫ్‌కు వచ్చేసరికి పూర్తిగా నీరుగారిపోతింది. చేతిని దానం చేసిన క్రికెటర్ గతానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సుదీర్ఘంగా సాగుతుంది. ఈ క్రమంలో కథానాయకుడు దుల్కర్ సల్మాన్ చాలా సేపు తెరపై కనిపించడు. క్రికెటర్ గా అతని ఎదుగుదల, విలన్ ఇచ్చే సమస్యలు ఏమాత్రం ఎమోషనల్‌గా కనెక్ట్ కావు. ఆకట్టుకునే కాన్సెప్ట్ ఉన్నప్పటికీ.. డైరెక్టర్ దానిని రొటీన్ రివేంజ్ డ్రామాగా మార్చేయడంతో సెకండాఫ్ పరీక్షగా మారుతుంది.
నటీనటులు ఎలా నటించారంటే?
దుల్కర్ సల్మాన్ కొన్ని యాక్షన్ విభాగాలు, ఫిజికల్ నటనలో మెరిసినప్పటికీ.. ఆయన స్థాయికి తగ్గ పాత్ర ఇది కాదు. హీరోయిన్ కాయదు లోహర్‌కు నటనకు అసలు ప్రాధాన్యత లేని పాత్ర దక్కింది. మైస్కిన్, ఆంటోనీ వర్గీస్, జయసుధ, రష్మిక కథిర్ వంటి బలమైన నటీనటులు ఉన్నప్పటికీ.. ఎవరి పాత్ర సరిగ్గా డిజైన్ చేయలేదు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్, జిమ్షీ ఖాలిద్ సినిమాటోగ్రఫీ సగటు స్థాయిలోనే ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉండాల్సింది.
ఫైనల్‌గా..
మంచి పాయింట్, ఇంటర్వెల్ ముందు వచ్చే 20 నిమిషాల సన్నివేశాలు మినహా 'ఐమ్ గేమ్' ప్రేక్షకుడిని నిరాశపరిచే రొటీన్ డ్రామాగా మిగిలిపోయింది.
*రేటింగ్: 2/5.













Click it and Unblock the Notifications