'ఐబొమ్మ' క్లోజ్: రవికి ఊహించని మద్దతు!

Ibomma Closed: తెలుగు సినీ ఇండస్ట్రీకి వందల కోట్ల నష్టం కలిగించిన ప్రముఖ పైరసీ వెబ్‌సైట్లు ఐబొమ్మ, బప్పం టీవీల నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ పైరసీ సామ్రాజ్యానికి తెరపడింది. రవి అరెస్ట్ తర్వాత పోలీసులు అతడి లాగిన్ వివరాలతో వెబ్‌సైట్లను శాశ్వతంగా మూసివేశారు. ఈ పరిణామంపై సినీ పరిశ్రమ, సోషల్ మీడియాలో భిన్నమైన సంచలనాత్మక స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.

సినీ పరిశ్రమ స్పందన: భారీ ఊరట
పైరసీ కారణంగా రూ.3,700 కోట్లు నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేసిన తెలుగు సినీ పరిశ్రమ ఈ అరెస్ట్‌ను, వెబ్‌సైట్ల మూసివేతను ఓ చారిత్రక విజయంగా చూస్తోంది. ప్రముఖ నటులు, నిర్మాతలు ఈ విజయానికి హైదరాబాద్ పోలీసులను అభినందించారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. "ఓ వ్యక్తి వేలాది మంది కష్టాన్ని దొంగిలించడం తప్పు. ఎంతో శ్రమకోర్చి సినిమాలు తీస్తే.. రవి లాంటి వాళ్లు పరిశ్రమలో వేలాది కుటుంబాలను దోచుకుంటున్నారు. ఇటువంటి నేరస్థులకు కఠిన శిక్ష పడితేనే ఇతరులు భయపడతారు" అని చిరంజీవి తీవ్రంగా స్పందించారు. "దమ్ముంటే పట్టుకోండి" అని పోలీసులకు సవాలు విసిరిన వ్యక్తిని పట్టుకున్నందుకు మాజీ సీపీ సీవీ ఆనంద్ సైబర్ క్రైమ్ పోలీసులను అభినందించారు.

Ibomma Closed Unexpected Support for Ravi on Social Media

సోషల్ మీడియాలో ఆశ్చర్యకరంగా సపోర్ట్!
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌పై సోషల్ మీడియాలో వచ్చిన స్పందనలు సినీ పరిశ్రమకు, పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. నెటిజన్లలో కొంతమంది పైరసీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ.. మరికొంత మంది రవికి మద్దతుగా పోస్టులు పెట్టడం గమనార్హం. నెటిజన్లలో కొంతమంది రవిని సినిమా 'రాబిన్‌హుడ్'లా అభివర్ణించారు.

టికెట్ ధరలే కారణం: చాలా మంది నెటిజన్లు తమ మద్దతుకు ప్రధాన కారణాన్ని సినిమా టికెట్ ధరలు విపరీతంగా పెంచడమేనని వెల్లడించారు. "ఐబొమ్మ లాంటి పైరసీ వెబ్‌సైట్‌లు లేకపోతే టికెట్ రేట్లు ఇంకా పెరిగిపోయి ఉండేవి. సామాన్యుడికి సినిమా దూరం అయ్యేది. అందుకే రవిని విడుదల చేయాలి" అంటూ కామెంట్లు చేశారు. రవి అరెస్ట్ వల్ల నిర్మాతలు భారీగా నష్టపోయినప్పటికీ, ఉచితంగా పైరసీ సినిమాలు చూసి లబ్ధి పొందిన ప్రేక్షకులు ఇప్పుడు అతనికి మద్దతుగా మాట్లాడటం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది.

ఐబొమ్మ నుంచి చివరి సందేశం
వెబ్‌సైట్‌ను మూసివేసే ముందు ఐబొమ్మ ఓపెన్ చేస్తే అందులో ఓ సందేశం కనిపించింది. "మీరు ఇటీవల మా గురించి విన్న ఉండవచ్చు లేదా ఎప్పటినుంచో మా సేవలను వినియోగిస్తున్న వారై ఉండవచ్చు.. దేశంలో పర్మనెంట్ గా మూసేస్తున్నాం" అని పేర్కొనబడింది. ఇది తమ సేవలు అంతమవుతున్నట్లు వినియోగదారులకు ఇచ్చిన ఐబొమ్మ ఇచ్చిన చివరి సందేశం. ఈ అరెస్ట్, వెబ్‌సైట్ల మూసివేత.. పైరసీ, సినిమా టికెట్ ధరలు, డిజిటల్ కంటెంట్ వినియోగంపై తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చను రేకెత్తించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+