జూనియర్ ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్నారు. ఇది రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటోంది. మొదటి భాగం విజయ దశమికి విడుదల కాబోతోంది. తర్వాత వార్2 విడుదలవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఇంతవరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయి.
మరికొద్దిరోజులు ఏ సినిమా రాకుండా ఆ హీరో ఎంత పెద్ద స్టార్ అయినా ప్రజలు మరిచిపోతారు. ఈ విషయాన్ని గుర్తించిన తారక్ వరుసపెట్టి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా ఇదే సూత్రాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అనుసరిస్తున్నారు. పుష్ప2 సినిమా సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఆగస్టు 15న విడుదల కాబోతోంది. తర్వాత అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అల్లు అరవింద్, కళానిధి మారన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని బన్నీ అనుకున్నాడు.

అయితే బన్నీ కూడా ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. పుష్ప1కు, పుష్ప2కు మధ్య తేడా ఎక్కువగా ఉంది. ఇలా అయితే కష్టమని భావించిన బన్నీ వెంటవెంటనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. అట్లీ తర్వాత త్రివిక్రమ్ కాకుండా రెండు సినిమాలను సమాంతరంగా తెరకెక్కించాలని భావిస్తున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది.
సినిమాను సిద్ధం చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ బాటలోనే అల్లు అర్జున్ కూడా పయనిస్తున్నాడంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం ఒక విషయాన్ని గమనించారని, సినిమాలు ఆలస్యంగా చేస్తే అభిమానులు కూడా మర్చిపోతారని గుర్తించి వేగంగా సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications