అల్లు అర్జున్ వాచ్ ఖరీదు, ప్రత్యేకత ఏమిటో తెలుసా?

ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు అల్లు అర్జున్. తర్వాత సినిమా సినిమాకు తనను తాను మెరుగులు దిద్దుకుంటూ వచ్చారు. ఒకరకంగా ఆయన తనని తాను తీర్చిదిద్దుకున్నారని చెప్పొచ్చు. మెగా అనే ముద్ర ఉండకూడదని, అల్లు అర్జున్ అనే ముద్రే ఉండాలని ఆయన నిశ్చయించుకొని ఆ దిశగా అడుగులు వేసుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీలో విభేదాలు కూడా చోటుచేసుకున్నాయి. అయినా ఈరోజు పాన్ ఇండియా హీరోగా అవతరించారు. తెలుగు సినీ పరిశ్రమకు కలగా మిగిలిపోయిన జాతీయ ఉత్తమ నటుడి అవార్డును పుష్ప సినిమాద్వారా అందుకున్నారు.

ఆగస్టు 15న విడుదల
సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న పుష్ప2 ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఇందులో ఫహద్ ఫాజిల్, రష్మిక, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయి. సినిమా విడుదలవడమే ఆలస్యం కొంచెం బాగుంది అనే టాక్ వచ్చినా వెయ్యి కోట్లరూపాయల వసూళ్లు ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

icon star allu arjun watch cost and specialities

వాచ్ ఖరీదు.. వామ్మో
తాజాగా జరిగిన తెలుగు దర్శకుల దినోత్సవ కార్యక్రమానికి బన్నీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ఎంతో సింపుల్ గా కనిపించారు. అలాగే స్టైలిష్ గా ఉన్నారు. తనను ఎందుకు స్టైలిష్ స్టార్ అంటారో మరోసారి నిరూపించారు. ఈ వేడుకలో ఆయన చేతికి పెట్టుకున్న వాచ్ గురించి చర్చ నడిచింది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బన్నీ ధరించిన పనైరా వాచ్ ధర రూ.3,97,431గా ఉంది. దీన్ని చూసిన నెటిజన్లు బన్నీకి ఈ వాచ్ అంటే ఎంతో ఇష్టమనుకుంటా అంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. పుష్ప2 తర్వాత అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+