'ఇడ్లీ కొట్టు' రివ్యూ: ధనుష్ కొత్త సినిమా ఎలా ఉందంటే..?

హీరో ధనుష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో ధనుష్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంది. తెలుగులో కూడా ధనుష్‌కు ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. ధనుష్ ఏ సినిమా చేసిన , అది తెలుగులో విడుదల కావాల్సిందే. 'సర్', 'తిరు', 'కుబేర' వంటి సూపర్ హిట్ సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్న ధనుష్ తాజాగా ఇడ్లీ కొట్టు అనే సినిమాతో ప్రేక్షుకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'తిరు' సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. స్వయంగా ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి తమిళంలో డీసెంట్ బజ్ ఏర్పడింది. అయితే తెలుగులో సరైన పబ్లిసీటి చేయకపోవడంతో ధనుష్ నటించిన సినిమా వచ్చిందనే విషయం చాలామందికి తెలియలేదు. గురువారం ప్రేక్షుకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కథ
కథానాయకుడు మురళి (ధనుష్) హోటల్ మేనేజ్‌మెంట్ చదివి, విదేశాల్లో స్థిరపడాలని కలలు కంటాడు. కానీ, అతని తండ్రి శివకేశవులు (రాజ్ కిరణ్) మాత్రం పట్నం మోజుకు లొంగకుండా, తమ స్వగ్రామంలోని ఇడ్లీ కొట్టును నడుపుతూ స్థానికంగా గౌరవం పొందుతుంటాడు. తండ్రి మాటకు విరుద్ధంగా మురళి విదేశాలకు వెళ్లి, బ్యాంకాక్‌లో గొప్ప స్థాయిలో స్థిరపడతాడు. అక్కడ బాస్ కూతురు శాలినీ పాండేతో పెళ్లికి సిద్ధమవుతాడు.

Idli Kottu Review Did Dhanush s Directorial Emotional Drama Succeed Nithya Menen Performance Analysis

అయితే, ఇంతలో తండ్రి మరణించడంతో అంత్యక్రియల కోసం స్వదేశం తిరిగి వస్తాడు. ఈ ప్రయాణం అతని జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. తన తండ్రి ప్రేమించిన ఆ ఇడ్లీ కొట్టును, ఆ ఊరిని విడిచి వెళ్లడానికి నిరాకరిస్తాడు. మురళి బ్యాంకాక్ జీవితాన్ని వదులుకొని, మళ్లీ ఇడ్లీ కొట్టును ఎందుకు చేపట్టాడు? ఈ ప్రయత్నంలో ఎదురైన అడ్డంకులేమిటి? అనేదే ఈ సినిమా కథాంశం.

విశ్లేషణ
సినిమా ఓపెనింగ్ చాలా సూటిగా మొదలవుతుంది. తండ్రికి తన సంప్రదాయ ఇడ్లీ వ్యాపారంపై ఉన్న ప్రేమ, మురళికి ఉన్న ఆధునిక కలలు స్పష్టంగా చూపించారు. ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా తండ్రి మరణం తరువాత మురళిలో కలిగే భావోద్వేగాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ధనుష్ స్వయంగా కొన్ని కంటతడి పెట్టించే సన్నివేశాలను చక్కగా రాసుకున్నాడు.

అయితే, సినిమా కథాంశం కొంచెం ఊహించదగినదిగా ఉండటం మైనస్. ఫస్ట్ హాఫ్ భావోద్వేగాల చుట్టూ తిరిగితే, సెకండ్ హాఫ్‌లో విలన్ ట్రాక్ కొంచెం రొటీన్‌గా అనిపిస్తుంది. సినిమా రియాలిటీకి కాస్త దూరంగా అనిపించినా, తండ్రి మాట కోసం జీవితాన్ని త్యాగం చేసే కొడుకు కథాంశాన్ని సరైన డ్రామాతో ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఎగ్జిక్యూషన్ విషయంలో ధనుష్ మరింత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగేది.

నటీనటులు & సాంకేతిక అంశాలు
ధనుష్ ఇలాంటి ఎమోషనల్ పాత్రలకు పర్‌ఫెక్ట్. మురళి పాత్రలో అతను ఒదిగిపోయి మెప్పించాడు. నిత్యా మీనన్ పల్లెటూరి పిల్లగా తన పాత్రకు న్యాయం చేసింది. రాజ్ కిరణ్ తండ్రి పాత్రలో గుర్తుండిపోతారు. అరుణ్ విజయ్ మరియు సముద్ర ఖని పాత్రలు రొటీన్‌గా అనిపించినా, ఉన్నంతలో పర్వాలేదు.

సాంకేతిక విభాగంలో, తెలుగు డబ్బింగ్ డైలాగులు ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. జీవి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలలో బీజీఎం హైలైట్‌గా నిలిచింది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ విషయంలో పల్లె వాతావరణం ఇంకా సహజంగా చూపించి ఉంటే బాగుండేది.

ఫైనల్
'ఇడ్లీ కొట్టు' సినిమా అద్భుతం కాకపోయినా, ఒక తండ్రి-కొడుకుల బంధం, గ్రామీణ సంస్కృతి విలువలను చాటిచెప్పే ఒక డీసెంట్ ఎమోషనల్ డ్రామా. కమర్షియల్ అంశాలు, ఎగ్జిక్యూషన్‌లో లోపాలు ఉన్నప్పటికీ, ధనుష్ నటన, కొన్ని భావోద్వేగ సీన్ల కోసం ఒకసారి చూడదగిన సినిమా ఇది.

రేటింగ్: 2.75 / 5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+