నటనకి గుడ్ బై చెప్పనున్నఇలియానా... ఎందుకో తెలుసా..?
పోకిరి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది గోవా బ్యూటీ ఇలియానా. ఆ సినిమా తర్వాత ఆమె వరుస సినిమాలు చేసుకుంటూ పోయింది. టాలీవుడ్‌లో అందరి హీరోలతో నటించింది ఈ అమ్మడు. అయితే, ఈ మధ్యకాలంలో పెళ్లి, కొడుకు కారణంగా సినిమాలకు దూరంగా ఉంది ఈ బ్యూటీ. బాలీవుడ్‌లో కూడా ఇలియానా కొ్న్ని సినిమాల్లో నటించింది. రణబీర్‌కపూర్‌తో నటించిన బర్ఫీ చిత్రం మంచి విజయాన్నే అందించింది. ఆ తర్వాత అక్షయ్‌కుమార్‌తో నటించింది. ఇక, తెలుగులో చివరిసారిగా రవితేజతో చేసిన సినిమా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. దాంతో ఈ అమ్మడు ఇక, సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. నటి ఇలియానా సినిమాల గురించి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇలియానా నటనకు గుడ్‌బై చెప్పి, విదేశాలకు వెళ్లిపోతున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని ఎంతగానో కుంగదీశాయి. ఓ ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్‌తో ఇలియానా కొంతకాలం రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరికి బ్రేకప్ అయ్యింది. అయితే, ఇలియానా పెళ్లి, పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడం వంటి విషయాలు అభిమానులను షాక్‌కు గురిచేశాయి. ఎందుకంటే, ఇలియానా తాను గర్భవతిని అని ప్రకటించడానికి కొన్ని నెలల ముందే వివాహం చేసుకున్నట్లు సమాచారం.

అయితే, ఇలియానా పెళ్లి ఫోటోలు, కానీ, వీడియోలు కానీ ఏవీ పోస్ట్ చేయలేదు. ఈ మధ్యే ఇలియాన తన భర్త మిచెల్ డోలెన్‌ని అభిమానులకు పరిచయం చేసింది. అయితే, ఇన్నీ షాకింగ్ విషయాలతో పాటు ఇలియానా మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె సన్నిహితులు నుంచి సమాచారం వినిపిస్తోంది. ఇలియానా ఇక నటనకు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. తన భర్త, కొడుకుతో కలిసి దేశం విడిచివెళ్లిపోతుందని సమాచారం.
యూఎస్ వెళ్లాలని ప్లాన్ చేస్తోన్న ఇలియానా : ఆమె యూఎస్ లో సెటిల్ కావాలని నిర్ణయించుకున్నట్లు ఇలియానా సన్నిహితులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ అమ్మడు ఇక సినిమాల్లో కనిపించదనే బాధ అభిమానులను కలవరపెడుతోంది. సినిమాల్లో అవకాశాలు రాకపోవడం ఒక కారణమయితే, దానికితోడు ఆమెకు నటనపై ఎలాంటి ఆసక్తి లేదని సన్నిహితులు చెబుతున్నారు. దాంతో ఇలియానా భర్త, కొడుకుతో కలిసి యుఎస్ వెళ్లిపోవాలనే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications