వేణుస్వామి ఖాతాలో మరో హీరోయిన్?
వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన చెప్పిన వాటిల్లో 100కు 100 శాతం ఏమైనా జరుగుతున్నాయా? అంటే ఏమీ లేదు. నాగచైతన్య-సమంత విడాకులు తీసుకుంటారని చెప్పారు. అదిమాత్రం జరిగింది. అంతే దానికే ఆయన పేరు మార్మోగిపోయింది. అలాగే ఆయన చేత పూజలు చేయించుకున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఈ రెండు సంఘటనలు జరిగాయని ఆయన చెప్పినవాటిల్లో జరగని 98 విషయాలను ప్రజలు వదిలేశారు.
ఆయనచేత ఎవరు పూజలు చేయించుకున్నా అది హాట్ టాపిక్ అవుతుంది. రష్మిక తర్వాత నిధి అగర్వాల్, డింపుల్ హయతి లాంటివారెందరో పూజలు చేయించుకున్నారు కానీ వారి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో ఉంది. తాజాగా ఆయన ఖాతాలో మరో హీరోయిన్ చేరిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా సీజన్-6లో హాట్ ఫేవరెట్. ఆమెకు భారీ పాపులారిటీ దక్కింది.

టాప్-5లో నిలిచి సినిమా అవకాశాల కోసం ఎదురు చూసింది. తన భవిష్యత్తు కోసం వేణుస్వామిని కలిసింది. తాను కూడా పూజలు చేయించుకున్న తర్వాత స్టార్ హీరోయిన్ గా మారిపోతాననే నమ్మకాన్ని వ్యక్తపరుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వేణుస్వామి పుట్టినరోజునాడు మూ గురూజీ హ్యాపీయెస్ట్ బర్త్ డే అంటూ శుభాకాంక్షలు తెలియజేసింది.
గుడిదగ్గర ఆయనచేత ఆశీర్వాదం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. సినిమాల్లో అవకాశాలు వచ్చేలా, స్టార్ హీరోయిన్ అయ్యేలా తనచేత పూజలు చేయించాలని వేణుస్వామిని కోరిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె కోరిక ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి మరి.












Click it and Unblock the Notifications