ఆ పనికి మమ్మల్ని వాడుకోకండి: ఇంద్రజ

ఈ మధ్యకాలం నుంచి సీనియర్ హీరోయిన్ల హవా సినిమాలతోపాటు టీవీల్లో కూడా నడుస్తోంది. ఒకప్పుడు పరిశ్రమను తమ గ్లామర్ తో ఒక ఊపు ఊపేసిన వారంతా తమ తమ జీవితాల్లో ప్రేమ, పెళ్లి, పిల్లలు లాంటి ఘట్టాలను దాటేయడంతోపాటు పరిశ్రమలోకి మళ్లీ ప్రవేశించి తమ సత్తాను చూపుతున్నారు. జబర్దస్త్ షో పుణ్యమా అని ఇంద్రజ టీవీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అమాయకత్వంగా కనిపిస్తూనే కౌంటర్లు వేయడంతోపాటు జబర్దస్త్ జడ్జిగా తనదైన శైలిలో జడ్జిమెంట్ చెబుతూ అందరినీ ఆకట్టుకుంది.

శ్రీదేవి డ్రామా కంపెనీ షో కు ఇంద్రజ పర్మినెంట్ జడ్జిగా మారిపోయారు. ఇంద్రజ జడ్జిమెంట్ ఎలా ఉంటుందనే విషయం భాను సాంగ్ కు కామెంట్స్ ఇచ్చినప్పుడే అర్థమైపోయింది. ప్రతి విషయాన్ని ఎంత లోతుగా విశ్లేషిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ లో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఇంటికే పరిమితం కాకుండా మహిళలు తమ సత్తాను చాటాలని ఆమె పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రంలో పాల్గొన్న మహిళలకు ఘనంగా నివాళులర్పించారు.

indraja latest viral comments

ఈ ఈవెంట్ లో ఇంద్రజ పురుషులకు ఒక చిన్న విజ్ఞప్తి చేసింది. అసభ్య పదజాలాన్ని ఉపయోగించడానికి ఆడవారిని అడ్డం పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేసింది. దయచేసి బూతులు తిట్టడానికి మమ్మల్ని వాడుకోవద్దని, పురుషులు.. పురుషులు కొట్టుకుంటున్నారా.. ? మీ పేర్లతోనే తిట్టుకోండి అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాల్లో కూడా కీలకపాత్రల్లో ఇంద్రజ నటిస్తోంది. కర్ణాటక సంగీత విద్వాంసులు కుటుంబంలో జన్మించిన ఇంద్రజ మంచి గాయని. ఈమె ముగ్గురు అక్క చెళ్లెల్లలో పెద్దది. భారతి, శోభ ఈమె చెల్లెళ్లు. ఇంద్రజ అసలు పేరు రజతి. పాఠశాలలో కూడా అనేక సంగీత, నాటక పోటీల్లో పాల్గొని బహుమతులందుకుంది. మాధవపెద్ది మూర్తి వద్ద వద్ద కూచిపూడి నృత్యరీతులు అభ్యసించడంతోపాటు ఆయన బృందంతో కలిసి విదేశాల్లో కూడా అనేక ప్రదర్శనలు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+