"హరిహర వీరమల్లు"లో బాబీ డియోల్‌ పాత్రని ముందు చేసింది ఎవరంటే..?

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం 'హరి హర వీరమల్లు'. ఈ పీరియాడిక్ డ్రామాకు మొదట క్రిష్ జగర్లమూడి దర్శకత్వం వహించగా.. పలు అనివార్య కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకొని సినిమా పూర్తిచేశారు. కాగా ఇప్పుడు ఫస్ట్ పార్టీ " స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌ " పేరుతో.. జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ షో లు ప్రారంభం అయ్యాయి.

పవన్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం రాబోతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజవుతోన్న మొదటి సినిమా కావడంతో వీరమల్లుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్స్ , ట్రైలర్లు ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసారి ఏకంగా పవన్ కల్యాణ్ స్వయంగా ప్రమోషన్లలో పాల్గొనడంతో హరి హర వీరమల్లుపై ఒక్కసారిగా హైప్ పెరిగింది.

interesting-deails-about-who-first-played-bobby-deols-role-in-harihara-veeramallu

ఈ చిత్రంలో హీరోయిన్‌ గా నిధి అగర్వాల్‌ నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మొఘల్ రాజు ఔరంగ జేబుగా ఓ కీలక పాత్రలో నటించాడు. అయితే వీరమల్లులో ఔరంగ జేబు పాత్ర కోసం బాబీ డియోల్ కన్న ముందు వేరొకరిని అనుకున్నారని తెలిసిందే. ఆయనతో కొద్ది రోజుల పాటు షూటింగ్ కూడా చేసినట్టు మూవీ యూనిట్ వెల్లడించింది. అయితే అనుకోని కారణాల వల్ల వైదోలిగినట్టు స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ నటుడు ఎవరా అని డిస్కషన్ నడుస్తోంది.

అర్జున్ రాంపాల్..

ఔరంగ జేబు పాత్రలో ముందుగా నటించింది బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ అని తెలుస్తోంది. ఈయన భగవంత్ కేసరి సినిమాలో విలన్ పాత్రతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా హరి హర వీరమల్లు కోసం కొన్ని రోజుల పాటు ఆయనతో షూటింగ్‌ కూడా చేశారట. అయితే సినిమా ఆలస్యం కావడంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో అర్జున్‌ రాంపాల్‌ తప్పుకున్నారని సమాచారం. ఆ తర్వాత ఆ పాత్ర కోసం బాబీ డియోల్‌ని తీసుకున్నట్టు చెబుతున్నారు. బాబీ డియోల్‌ సైతం యానిమల్ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. మరీ ఈ సినిమాతో ఏ మేరకు అలరిస్తారో చూడాలి.

interesting-deails-about-who-first-played-bobby-deols-role-in-harihara-veeramallu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+