స్టార్ హీరోలతో బడా హిట్స్.. కానీ చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్న బ్యూటీ !
బాలీవుడ్‌లో తన అందం, అభినయాలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన హీరోయిన్లలో ఒకరు " సోనమ్ ఖాన్ ". చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. తక్కువ కాలంలోనే స్టార్‌డమ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ చేతులారా తన కెరీర్‌ని పక్కన పెట్టి.. పర్సనల్ లైఫ్ వి ముందడుగు వేసింది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుండడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
14 ఏళ్లకే కెరీర్ స్టార్ట్..
సోనమ్ అసలు పేరు భక్తవర్ ఖాన్. 1972లో జన్మించిన ఆమె కేవలం 14 ఏళ్ల వయసులోనే సినీ రంగంలో హీరోయిన్‌గా ప్రవేశించింది. తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు నటించిన సామ్రాట్ (1987) సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత వెంటనే బాలీవుడ్‌కి అడుగుపెట్టింది. హిందీ సినిమాల్లోకి వెళ్లిన తర్వాత తనపేరును ప్రముఖ నిర్మాత యశ్ చోప్రా ఆమె పేరును "సోనమ్ ఖాన్" గా మార్చి ప్రేక్షకులకు పరిచయం చేశారు.

రెండేళ్లలో 20 సినిమాలు..
బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సోనమ్.. కేవలం రెండు సంవత్సరాల్లోనే 20కి పైగా చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించింది. అమితాబ్ బచ్చన్, సన్నీ డియోల్, సంజయ్ దత్, గోవిందా, చంకీ పాండే వంటి టాప్ హీరోల సరసన నటించి మెప్పించింది. 1988లో విడుదలైన 'విజయ్' సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే 'మిత్ జాయే గమ్' వంటి పాటలు, డ్యాన్సులు అప్పట్లో యువతను ఉర్రూతలూగించాయి. అంతే కాకుండా తెలుగులో సైతం మెగాస్టార్ చిరంజీవి సరసన.. కొదమసింహం (1990)లో నటించి తన గ్లామర్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉండగానే వ్యక్తిగత నిర్ణయాలతో సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యింది.
కేవలం 19 ఏళ్ల వయసులోనే తనకంటే 17 ఏళ్లు పెద్దవాడైన ప్రముఖ దర్శకుడు రాజీవ్ రాయ్‌ను ఆమె వివాహం చేసుకుంది. వివాహం జరిగిన మరుసటి ఏడాది లోనే తల్లి అయిన సోనమ్.. పిల్లల కోసం పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కి ప్రాధాన్యం ఇచ్చింది. అయితే వారి కుమారుడుకి ఆటిజం సమస్య కారణంగా చికిత్స కోసం యూరప్‌లోనే స్థిరపడ్డారు. ఇక పలు కారణాలతో 2016లో సోనమ్-రాజీవ్ విడాకులు తీసుకున్నారు.
రీ ఎంట్రీకి ప్లాన్..
అయితే ఇప్పుడు సోనమ్ మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను పెంచుకునే పనిలో ఉన్నారు. దీంతో ఆమె త్వరలోనే రీ ఎంట్రీ ఇస్తారని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్న వయసులో స్టార్‌డమ్ అందుకున్నా.. వ్యక్తిగత నిర్ణయాలతో తన కెరీర్‌ను నాశనం చేసుకున్న ఈమె.. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీతో సక్సెస్ సాధిస్తారా అని చర్చ నడుస్తోంది.
-
కోకాపేట్ అల్లు సినిమాస్ లాంచ్ తేదీ అనౌన్స్: ఆ సినిమాలతో బోణీ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
"నేను ఎంతమందితో తిరిగినా అది నీ ప్రాబ్లెమ్ కాదు" -
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. -
ట్రైలర్ కే థియేటర్లు తగలబడుతున్నాయి.. ఇక సినిమా రిలీజ్ అయితే..!! -
మరో కొత్త కాన్సెప్ట్..? గ్యాప్ ఇవ్వు అన్న కాస్తా..! -
నా కథను మానభంగం చేసేశారు..! -
"ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు" -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !! -
తప్పేం చేయలేదు.. తిరుమలలో కేక్ కటింగ్ వివాదంపై దివ్వెల మాధురి షాకింగ్ స్పందన! -
ఆ సినిమా వదులుకోవడమే ప్రభాస్ కెరీర్‌కు ‘శ్రీరామరక్ష’












Click it and Unblock the Notifications