టార్గెట్ రూ.2 వేల కోట్లు కలెక్షన్స్.. "స్పిరిట్" కోసం సందీప్ రెడ్డి బడా ప్లాన్ !

గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ చిత్రాలతో ఇండియన్ సినిమా పరిశ్రమలో దూసుకుపోతున్నారు. ఇటీవలే సంక్రాంతి కానుకగా 'రాజాసాబ్' తో ప్రేక్షకులను పలకరించారు ప్రభాస్. ఇప్పుడు క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' మూవీతో మరోసారి సంచలనానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం పాన్-వరల్డ్ స్థాయిని లక్ష్యంగా చేసుకుని రూపొందుతుండటం విశేషం.

టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్‌పై తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. 'యానిమల్' ఫేమ్ త్రిప్తి డిమ్రి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'స్పిరిట్' సినిమాను తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, తమిళ, మలయాళ, కన్నడతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటించనున్నారనే టాక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

interesting-details-about-prabhas-and-sandeep-reddy-spirit-movie

ఈ చిత్రంతో ప్రభాస్ తన సినీ కెరీర్‌లో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలతో హీరో క్యారెక్టరైజేషన్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన సందీప్.. ఈసారి ప్రభాస్‌ను పూర్తిగా రా అండ్ రస్టిక్ మాస్ అవతార్‌లో చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రతి ఇంటర్వ్యూలోనూ ఇది ఒక సీరియస్ కాప్ స్టోరీ అని వంగా ఇస్తున్న ఎలివేషన్లు సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.

ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన వాయిస్ నోట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అయితే అభిమానుల్లో పిచ్చెక్కించింది. ఆ పోస్టర్‌లో షర్ట్ లేకుండా, ఒంటి నిండా గాయాలతో నిలబడ్డ ప్రభాస్‌కు త్రిప్తి డిమ్రి సిగరెట్ వెలిగిస్తూ కనిపించడం, చేతిలో మద్యం బాటిల్ ఉండటం సినిమాకి రా టోన్‌ను స్పష్టంగా చూపించింది. ప్రభాస్ ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించని ఈ లుక్ సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా 'స్పిరిట్' 2027 సంక్రాంతి బరిలో నిలుస్తుంది అనే ప్రచారం జరిగింది. కానీ ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ ఈ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంక్రాంతి రేస్‌ నుంచి తప్పుకున్నప్పటికీ, మార్చి నెల విడుదల ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఎందుకంటే..

మార్చి 5, 2027 శుక్రవారం విడుదలయ్యే 'స్పిరిట్'కి వెంటనే మహా శివరాత్రి (మార్చి 6 - శనివారం), ఆ తర్వాత ఆదివారం (మార్చి 7) ఉండటంతో మూడు రోజులు వరుస సెలవులు కలిసొస్తున్నాయి. ఇది ఓపెనింగ్ కలెక్షన్లకు భారీ బూస్ట్ ఇవ్వనుంది. అంతే కాకుండా మార్చి 10న రంజాన్, ఆ తర్వాత మార్చి 13, 14న వీకెండ్, మార్చి 22న హోలీ, మార్చి 26న గుడ్ ఫ్రైడే, మళ్లీ మార్చి 27, 28న వీకెండ్ రావడంతో లాంగ్ సమ్మర్ సీజన్ మొత్తం సినిమాకు కలిసి వచ్చేలా షెడ్యూల్ సెట్ చేసినట్లు కనిపిస్తోంది. దీంతో ఈసారి ప్రభాస్ - సందీప్ కలిసి రూ.2 వేల కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టడం పక్కా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+