నితిన్ సినిమా కోసం డేవిడ్ వార్నర్ కి కళ్లు చెదిరే రెమ్యూనరేషన్..?
ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మామూలు ఫేమస్ కాదు. క్రికెట్ అభిమానులకు సుపరిచితుడైన డేవిడ్ వార్నర్.. తెలుగు సినిమాల్లో సాంగ్స్, డైలాగ్స్ కి రీల్స్ చేస్తూ ఉంటారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులతో కూడా రీల్స్ చేస్తారు ఈ క్రికెటర్. ఇక అల్లు అర్జున్ పుష్ప రీల్స్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఏకంగా అల్లాఉ అర్జున్ సైతం వార్నర్ రీల్స్ ను రీ పోస్ట్ చేస్తూ ఉంటారు. దీంతో ఎప్పుడెప్పుడు ఆయన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు.
అయితే డేవిడ్ వార్నర్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టైమ్ ఇప్పుడు రానే వచ్చింది. యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం 'రాబిన్ హుడ్'. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.

గత కొంత కాలంగా ఆయన నటిస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్న తరుణంలో రీసెంట్ గానే ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రీసెంట్ గానే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫ్రమ్ బౌండరీ టూ బాక్సాఫీస్.. తెలుగు సినిమాకు స్వాగతం డేవిడ్ వార్నర్ అంటూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో అని జోరుగా చర్చ జరుగుతోంది.
అయితే ఈ మూవీ కోసం డేవిడ్ వార్నర్ నాలుగు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అందుకు గాను ఆయన రూ.3 కోట్లు పారితోషకంగా అందుకున్నాడని టాక్ నడుస్తోంది. అలానే మూవీ ప్రమోషన్స్ లో సైతం పాల్గొనడం కోసం అదనంగా రూ.కోటి చార్జ్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు రిలీజ్ డేట్ సమీపిస్తున్న తరుణంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వరుసగా ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. చూడాలి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అని.. అలానే డేవిడ్ వార్నర్ సినిమాకు ఎంత మేర ప్లస్ అవుతారో అని.












Click it and Unblock the Notifications