'సంక్రాంతికి వస్తున్నాం' హిందీ రీమేక్ లో హీరో ఎవరంటే..?
విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ హ్యాట్రిక్ హిట్ అందుకుంది. ఏకంగా 300 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం పొంగల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ నటనతో పాటు బుల్లిరాజు కామెడీ కూడా సినిమాకు బాగా కలిసొచ్చింది. దీంతో వచ్చే సంక్రాంతికి సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం అనే పేరుతో సినిమా చేస్తామని కూడా ప్రకటించారు. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో ఓటీటీ లోకి కూడా రాబోతోంది.
ఈ క్రమంలోనే ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ను హిందీలో రీమేక్ చేయడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని
భావిస్తున్నారట. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇక అక్షయ్ కుమార్ గత సినిమాలు వరుసగా ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న తరుణంలో ఈ హిట్ మూవీని రీమేక్ చేసేందుకు ఆయన కూడా అంగీకరించారని సమాచారం.

అయితే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యిందని అంటున్నారు. దాంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిందీ రీమేక్ బాధ్యతలను వేరే దర్శకుడికి.. దిల్ రాజు అప్పగించబోతున్నారని చర్చించుకుంటున్నారు. డైరెక్టర్ ఫిక్స్ అయిన తర్వాత రీమేక్ పనులు మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక దిల్ రాజు గతంలో తెలుగులో హిట్ అయిన హిట్' సినిమాని హిందీలో రీమేక్ చేసారు. శైలేష్ కొలను దర్శకత్వంలో రాజ్ కుమార్ రావు హీరోగా చిత్రం తెరకెక్కగా.. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అలానే 'జెర్సీ' రీమేక్ లోనూ దిల్ రాజు పార్ట్ అయ్యారు కానీ ఆ సినిమా కూడా నిరాశ పరిచింది. మరి ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' హిందీ రీమేక్ అయినా దిల్ రాజుకి సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.
మరోవైపు లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చిరంజీవితో చేయబోయే సినిమా గురించి అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్లు చేశారు. మరో నాలుగు నెలల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని కూడా తెలియజేశారు. చిరుతో చేయబోయే సినిమాకి అనిల్ రావిపూడి ఏకంగా రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు సినిమా హిట్ అయి లాభాలు వస్తే లాభాల్లో వాటాలు తీసుకునేందుకు డీల్ సెట్ చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications