సినిమాకు ‘ఇంటర్వెల్’ ఎందుకిస్తారు? దాని వెనక పెద్ద కథే ఉంది!

వెండితెరపై ఆ క్షణం ఒక ఉత్కంఠ... 'INTERVAL' అని పడగానే థియేటర్‌లో ఒక్కసారిగా లైట్లు వెలుగుతాయి! కొందరికి ఇది పాప్‌కార్న్ బ్రేక్, మరికొందరికి మైండ్ రీఫ్రెష్ టైమ్! అసలు సినిమా మధ్యలో ఈ విరామం వెనుక ఉన్న అసలు రహస్యమేంటో తెలుసా? ఒక సూపర్ హిట్ సినిమా చూస్తున్నప్పుడు, కథ అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగే సమయంలో సడన్‌గా స్క్రీన్ పై 'ఇంటర్వెల్' లేదా 'బ్యాంగ్' అని పడుతుంది.

డిజిటల్ యుగంలో సెకన్లలో సినిమాను పూర్తి స్థాయిగా ప్రదర్శించే సాంకేతికత అందుబాటులోకి వచ్చినా, భారతీయ చిత్రసీమను మాత్రం ఈ 'ఇంటర్వెల్ కల్చర్' వదల్లేదు. అసలు వెండితెరపై ఈ విరామ సంస్కృతి ఎలా మొదలైంది? డిజిటల్ కాలంలోనూ ఇది ఎందుకు కొనసాగుతోంది? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సైన్స్ మరియు బిజినెస్ సీక్రెట్స్ తెలుసుకుందాం.

'దురంధర్ 2', 'పుష్ప 2' రికార్డుల్నీ దాటేసిన చిన్న సినిమా.. ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలే..!
'దురంధర్ 2', 'పుష్ప 2' రికార్డుల్నీ దాటేసిన చిన్న సినిమా.. ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలే..!
Interval in Movies There s a Fascinating Story Behind This Tradition

ఒక రీల్ పూర్తయిన తర్వాత మరో రీల్

ఒకప్పుడు ఇప్పటిలా హార్డ్ డిస్క్‌లు, డిజిటల్ ప్రొజెక్టర్లు ఉండేవి కావు. భారీ ఫిల్మ్ రీళ్లను ప్రొజెక్టర్‌కు అమర్చి సినిమాలు ప్రదర్శించేవారు. సుదీర్ఘమైన మూడు గంటల సినిమాలో ఒక రీల్ పూర్తయ్యాక, ప్రొజెక్షనిస్ట్ రెండో రీల్‌ను అమర్చడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టేది. ఆ సాంకేతిక విరామాన్నే చిత్ర పరిశ్రమ 'ఇంటర్వెల్'గా మార్చింది. కాలక్రమేణా టెక్నాలజీ మారి ప్రొజెక్టర్లలో రీళ్లు మార్చే అవసరం లేకుండా పోయినా, ప్రేక్షకుడికి అలవాటైపోయిన ఆ విరామం భారతీయ సినిమా సంస్కృతిలో ఒక భాగమైపోయింది.

పాశ్చాత్య సినిమాలతో పోలిస్తే మన భారతీయ చిత్రాల కథా నిర్మాణం చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఇంటర్వెల్ అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు... కథలో అతిపెద్ద ట్విస్ట్, ఊహించని షాక్, లేదా భారీ యాక్షన్ సీన్‌ను పరిచయం చేసే వేదిక! మొదటి అర్ధభాగాన్ని ఒక ఎత్తులో ముగించి, "నెక్స్ట్ ఏం జరగబోతోంది?" అనే ఆత్రుతను ప్రేక్షకునిలో కలిగించడానికే ఈ 'ఇంటర్వెల్ బ్లాక్'ను దర్శకులు మైండ్ గేమ్‌లా డిజైన్ చేస్తారు. ఈ సస్పెన్స్ సినిమా రెండో భాగం పై అంచనాలను రెట్టింపు చేస్తుంది.

గుహను వీడిన కూన... సింహంలా: నందమూరి మోక్షజ్ఞ సినిమా ఖరారు
గుహను వీడిన కూన... సింహంలా: నందమూరి మోక్షజ్ఞ సినిమా ఖరారు

ఆర్థిక కోణం కూడా ఉంది

ఇంటర్వెల్ వెనుక చాలా పెద్ద ఆర్థిక కోణం కూడా ఉంది. థియేటర్ యజమానులకు టికెట్ విక్రయాల కంటే, ఈ 15 నిమిషాల విరామంలో జరిగే స్నాక్స్ వ్యాపారం ద్వారానే అత్యధిక లాభాలు వస్తాయి. ప్రేక్షకుడు రిఫ్రెష్ అవ్వడానికి, వాష్‌రూమ్‌కి వెళ్లి రావడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. అదే సమయంలో థియేటర్ క్యాంటీన్లలో పాప్‌కార్న్, సమోసాలు, కూల్ డ్రింక్స్, కాఫీ అమ్మకాలు విపరీతంగా జరిగి బిజినెస్ నెట్‌వర్క్ లాభాల బాట పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సినిమాలు ఎలాంటి విరామం లేకుండా నాన్-స్టాప్‌గా ప్రదర్శిస్తారు.

కానీ ఆ హాలీవుడ్ సినిమాలు భారతదేశానికి వచ్చేసరికి మన థియేటర్ల వ్యాపార విధానం కోసం, ప్రేక్షకుల అలవాటు కోసం బలవంతంగా మధ్యలో ఆపి ఇంటర్వెల్ ఇస్తారు. హాలీవుడ్ చిత్రాలను ఇంటర్వెల్ పాయింట్లతో తీయరు కాబట్టి, కొన్నిసార్లు కీలకమైన డ్రామా సీన్ మధ్యలోనే సినిమా ఆగిపోయి సీరియస్ మూవీ లవర్స్‌కు కొంత చిరాకు తెప్పిస్తుంటుంది. ఏది ఏమైనా, టెక్నాలజీ ఎంత మారింది అన్నా... ఒక కరకరలాడే పాప్‌కార్న్ టబ్‌ను చేతిలో పట్టుకుని, "సెకండ్ హాఫ్‌లో హీరో ఏం చేస్తాడో?" అని పక్కనోడితో చర్చించే ఆ ఇంటర్వెల్ అనుభూతి భారతీయ సినిమా లవర్స్‌కు ఎప్పటికీ ప్రత్యేకమే!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+