రెండో ప్రియుడికి కూడా బ్రేకప్ చెప్పబోతున్న రష్మిక?
కన్నడ బ్యూటీ రష్మిక గురించి ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు. కన్నడం నుంచి తెలుగులోకి వచ్చి అచ్చమైన తెలుగు హీరోయిన్ లా మారిపోయింది. ఆ తర్వాత తమిళం, హిందీలో కూడా చేస్తూ ఈరోజుకు పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంటుంది. ఆడవాళ్లు మీకు జోహార్లు, వారసుడు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ సీతారామం సినిమాతో మంచి హిట్ కొట్టి పరిశ్రమలో గట్టిగా నిలదొక్కుకుంది. పుష్ప1, పుష్ప2 చిత్రాలతో తిరుగులేని క్రేజ్ దక్కించుకోవడంతోపాటు స్టార్ హీరోయిన్ గా రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది.
చాలాచోట్ల దొరికిపోయారు
కన్నడంలో రక్షిత్ శెట్టితో కిర్రాక్ పార్టీ సినిమా చేసే సమయంలో అతనితో ప్రేమలో పడింది. తర్వాత కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి చలో సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టి ఈరోజున మంచి హీరోయిన్ గా ఇమేజ్ ను సొంతం చేసుకుంది రష్మిక. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండను ప్రేమిస్తోందని, వీరిద్దరూ కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ పిక్నిక్స్ కు వెళుతూ, హాలిడేస్ కు వెళుతూ విమానాశ్రయాల్లో చాలాచోట్ల ఫొటోలకు దొరికిపోయారు. ఇటీవలే విడుదలైన పుష్ప2 సినిమాను విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులందరితో కలిసి సినిమా చూసింది రష్మిక.

అందరికీ తెలుసంటూ చెప్పింది
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న కథనం ప్రకారం త్వరలోనే తన రెండో ప్రియుడైన విజయ్ దేవరకొండకు కూడా రష్మిక బ్రేకప్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక.. వరుసగా ఫ్లాప్స్ తో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ.. ఇలా రెండు భిన్నధ్రువాలుగా వీరిద్దరూ ప్రయాణం చేస్తున్నారు. 2017లో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకున్న తర్వాతే బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో ది గర్ల్ ఫ్రెండ్, చావా, రెయిన్ బో సినిమాలతోపాటు యానిమల్ 2 చేస్తుందో? లేదో తెలియాల్సి ఉంది. ఇటువంటి తరుణంలో విజయ్ దేవరకొండతో బ్రేకప్ చెప్పాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే తాను త్వరలో ఎవరిని వివాహం చేసుకోబోతున్నానే విషయం మీ అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించింది. అయితే అకస్మాత్తుగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటనేది తెలియరావడంలేదు. ఈ వార్తలో నిజం ఉందా? లేదా? అనేది తెలియాలంటే ఈ అమ్మడు స్పందిస్తేనే తెలుస్తుంది. అప్పటివరకు ఓపిక పట్టాల్సిందే.












Click it and Unblock the Notifications