Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలుగు సినీ పరిశ్రమను శాసిస్తున్న ప్రొద్దుటూరు, రాజమండ్రి!

తెలుగులోనే కాదు.. దేశవ్యాప్తంగా ఏ భాషలోనైనా నిర్మాత సినిమా తీయాలంటే సొంత డబ్బును ఖర్చుపెట్టరు. బయట నుంచి వడ్డీకి డబ్బులు తెస్తారు. అలా వడ్డీకి డబ్బులిచ్చేవారు వేళ్లమీద లెక్కపెట్టగలిగే సంఖ్యలోనే ఉంటారు. ఎందుకంటే సినిమా అనేది కోట్ల రూపాయల వ్యాపారం కాబట్టి. కోట్ల రూపాయలు వడ్డీకిస్తున్నారంటే దానికి వచ్చే వడ్డీ కూడా కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. అయితే అది చాలా పెద్ద సంఖ్య కావడంతో అందరికీ ఆ స్థాయి ఉండదు.. ఉన్నా మరికొందరు ముందుకు రాదు. కొందరు మాత్రమే ధైర్యంగా వడ్డీకిచ్చి, సినిమా విడుదలవడానికి ముందురోజే ముక్కుపిండి మరీ వసూలు చేసుకుంటారు. ఆ సత్తా ఉన్నవారే పరిశ్రమలోనివారికి డబ్బులు వడ్డీకిస్తుంటారు.

ఫైనాన్షియర్లకంటే వీరేం పెద్దవారు కాదు
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఏ నిర్మాత తన సొంత డబ్బుతో సినిమాలు తీయడంలేదు. వడ్డీకి ఫైనాన్స్ తీసుకొని ఆ డబ్బును పెట్టుబడిగా పెడుతున్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రాంతాలవారీగా అమ్మకాలు జరిపి వచ్చిన డబ్బును ఫైనాన్షియర్లకు కట్టేస్తారు. గతంలో లేదుకానీ.. ఇప్పుడు మాత్రం ఓటీటీ డీల్స్ ద్వారా వచ్చే డబ్బు నిర్మాతకు బోనస్ లాంటిది. థియేట్రికల్ హక్కుల్లో వస్తే మరో బోనస్ అనుకోవచ్చు. ఒక స్థాయి ఉన్న హీరో సినిమా అయితే మ్యూజికల్ హక్కుల ద్వారా కూడా డబ్బులు వస్తాయి.

Is the Telugu film industry in the hands of Proddatur and Rajahmundry

శాటిలైట్ రైట్స్ అమ్మకం ద్వారా, ఇతర భాషల్లో రీమేక్ కోసం ఎవరైనా అడిగితే అమ్మడంద్వారా సాధ్యమైనంత మేరకు నిర్మాతకు డబ్బులు వస్తాయి. ఒకవేళ సినిమా ఫ్లాపైనా వడ్డీకి తీసుకున్న డబ్బులు మాత్రం కచ్చితంగా చెల్లించాల్సిందే. లేదంటే వారు ఊరుకోరు. అంటే కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న దర్శకులు, హీరోలు, నిర్మాతలు కూడా ఈ ఫైనాన్షియర్ల కంటే చిన్నవారే అని చెప్పొచ్చు.

టీసిరీస్, సరిగమ చూసుకుంటున్నారు
ప్రస్తుతానికి మన తెలుగు సినీ పరిశ్రమను ప్రొద్దుటూరుకు చెందిన రెండు ఫైనాన్షియర్స్ సిండికేట్స్, రాజమండ్రికి చెందిన మరో ఫైనాన్సియర్ సిండికేట్స్ శాసిస్తున్నాయి. సినిమాలు ఆడనప్పుడు, నిర్మాత నష్టపోయినప్పుడు మానవత్వంతో కాస్తంత వెనక్కు తగ్గుతున్నారు కానీ తర్వాత సినిమాకైనా వారి డబ్బును వారు వసూలు చేసుకుంటున్నారు. అయితే అటువంటి ఫైనాన్షియర్లను కూడా మన తెలుగు నిర్మాతలు ఇబ్బందులు పెడుతుండటంతో చాలావరకు సినిమాలకు ఫైనాన్స్ చేయడాన్ని అందరూ మానుకున్నారు. ప్రస్తుతానికి ప్రొద్దుటూరు, రాజమండ్రివారే చేస్తున్నారు.

మన తెలుగు నిర్మాతలు జాతీయ స్థాయిలో సరిగమ, టి సిరీస్ లాంటి సంస్థల నుంచి ఫైనాన్స్ తీసుకుంటున్నాయి. వారు ముక్కుపండి మరీ వసూలు చేస్తారు. అయితే ఇలాంటి సంస్థలను కూడా ముప్పుతిప్పలు పెట్టిన నిర్మాతలున్నారని ఇండస్ట్రీలో టాక్. మరి ఫైనాన్షియర్లు క్రమంగా తగ్గుతుండటంతో భవిష్యత్తులో నిర్మాతలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందనే అభిప్రాయం వినపడుతోంది. ప్రస్తుతానికి ప్రొద్దుటూరు, రాజమండ్రి చేతుల్లోనే పరిశ్రమ ఉంది. అంతకుమించి నిర్మాతలకు డబ్బులిచ్చేవారెవరూ కనపడటంలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+