సినిమాలకు త్రిష గుడ్ బై?
టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర సీమల్లో రెండు దశాబ్ధాలుగా తనదైన ముద్ర వేసిన స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ త్వరలో సినిమాలకు స్వస్తి చెప్పనున్నారా?. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు దళపతి విజయ్‌తో అఫైర్ వార్తలు, మరోవైపు ఆమె పెట్టిన కొన్ని క్రిప్టిక్ పోస్టులు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
కెరీర్ ముగింపుపై త్రిష మనసులో ఏముంది?
త్రిష తన కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నఉన్నప్పటికీ.. ఆమె త్వరలోనే సినీ ఇండస్ట్రీని వీడనున్నారనే వార్తలు కోలీవుడ్‌లో జోరందుకున్నాయి. ఇటీవల ఆమె కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయడం తగ్గించారని.. కేవలం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి నటనకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే గతంలో త్రిష మాట్లాడుతూ.. తనకు ప్రాణం ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటానని చెప్పారు. మరి ఇప్పుడు వినిపిస్తున్న ఈ కెరీర్ ముగింపు వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే త్రిష స్వయంగా స్పందించాల్సి ఉంది.

విజయ్ విడాకుల గొడవ.. త్రిష పోస్టులు !
దళపతి విజయ్, తన భార్య సంగీత విడాకుల కేసు విషయంలో త్రిష పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సంగీత తన విడాకుల పిటిషన్ లో ఓ నటి ప్రస్తావన తెచ్చారని వార్తలు రావడంతో నెటిజన్ల దృష్టి మొత్తం త్రిషపై పడింది. సరిగ్గా అదే సమయంలో త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. "ప్రేమ ఒక్కటే సర్వస్వం కాదు, కానీ ప్రేమ లేకపోతే ప్రతిదీ అర్థరహితం" అని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా.. అనవసరమైన వాదనల కంటే మౌనంగా ఉండి మనశ్శాంతిని కాపాడుకోవడం మిన్న అని త్రిష చెప్పుకొచ్చారు.
అనుమానాలకు ఆజ్యం పోసిన ఫోటోలు
విజయ్, త్రిషల మధ్య ఏదో ఉందనే ప్రచారానికి ప్రధాన కారణం వారిద్దరూ ఇటీవల ఓ వివాహ వేడుకలో జంటగా కనిపించడమే. 15 ఏళ్ల గ్యాప్ తర్వాత 'లియో' సినిమాతో మళ్లీ జతకట్టిన ఈ జంట.. అప్పటి నుంచి తరచుగా కలిసి వెకేషన్లకు వెళ్తున్నారనే పుకార్లు వస్తున్నాయి. విజయ్ తన రాజకీయ ప్రస్థానం (టీవీకే పార్టీ) ప్రారంభించే తరుణంలో ఇలాంటి వ్యక్తిగత వివాదాలు రావడం ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రస్తుతం త్రిష చేతిలో ఉన్న ప్రాజెక్టులివే..
ఒకవేళ త్రిష సినిమాలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నా.. ఆమె చేతిలో ప్రస్తుతం కొన్ని భారీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న 'విశ్వంభర' తో పాటు తమిళంలో 'కరుప్పు' వంటి చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ సినిమాలు విడుదలైన తర్వాతే త్రిష తన భవిష్యత్తు ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉందని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఆమె వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో త్రిష క్లారిటీ ఇస్తే తప్ప ఈ రూమర్లకు చెక్ పడేలా లేదు.












Click it and Unblock the Notifications