నిజ జీవితంలో 100 రోజులు పూర్తి చేసుకున్న స్టార్ హీరో, కలలో కూడా ఊహించలేదు సామి
స్టార్ హీరో జీవితంలో 100 రోజులు పూర్తి అయ్యాయి. అయితే ఆ హీరో సినిమా విడుదలై వంద రోజులు సినిమా విజయవంతంగా పూర్తి అయిన విషయం మాత్రం కాదు. శ్యాండిల్ వుడ్ హీరో దర్శన్ నటించి చివరి సారిగా విడుదల అయిన కాటేరా సినిమా అనేక సెంటర్లలో వంద రోజులు విజయవంతంగా ప్రదర్శించడంతో ఆ హీరో అభిమానులు చేసిన సందడి అంతాఇంతా కాదు. ఇదే ఏడాదిలోనే ఈ విజయోత్సవ వేడుకలు జరిగాయి.
అయితే రేణుకాస్వామి హత్య కేసులో కటకటాల వెనక్కి వెళ్లిన హీరో దర్శన్ కర్మ ఫలం ఎలా ఉంది అంటే.? ఆయన జైలుకు వెళ్లి అక్షరాల వంద రోజులు పూర్తి అయ్యింది. మైసూర్ టూ బళ్లారి నగరాల మధ్యలో హీరో దర్శన్ జర్నీ వందల రోజులు నేటితో పూర్తి అయ్యింది. హీరో జర్నీలో బెంగళూరు సెంట్రల్ జైలు ఎపిసోడ్ కూడా ఉంది. సెంట్రల్ జైలుకు వెళ్లిన హీరో దర్శన్ గోల్డెన్ స్పెషల్ 100 రోజుల పూర్తి అయ్యిందని ఆయన గిట్టని కొందరు ఇతర హీరో అభిమానులు అంటున్నారు.

హీరో దర్శన్ బెంగళూరులోని పరప్ప అగ్రహార సెంట్రల్ జైలు నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు షిఫ్ట్ అయ్యాడు. జైలులో దర్శన్ పడిన కష్టాలను చూసి ఆయన అభిమానులు చలించిపోతున్నారు. హీరో
దర్శన్ అరెస్ట్ అయ్యి వంద రోజులైంది. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అండ్ కో అరెస్టు అయ్యి సెంట్రల్ జైలులో ఉన్నారు. అనేక కారణాలతో హీరో దర్శన్ బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు షిఫ్ట్ అయ్యాడు.
హీరో దర్శన్ నిజజీవితంలో వంద రోజులు జైల్లో ఉండటం ఆయన అభిమానులు ఊహించకోలేకపోతున్నారు. హత్య కేసులో సెప్టెంబరు 4వ తేదీన పోలీసు అధికారులు చార్జిషీటు కూడా సమర్పించారు. దర్శన్ తదుపరి ఎత్తుగడ ఏమిటి..? దర్శన్ జైలు నుంచి బయటకు రావడానికి ఎలా ప్రయత్నిస్తున్నాడో అనే విషయం అంతు చిక్కకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఈ
హత్య కేసులో దర్శన్ అరెస్టయి నేటికి 100 రోజులు అయ్యింది. ఇదే కేసులో నిందితులు కొందరు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా హీరో దర్శన్ మాత్రమే ఇంకా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. అలా అయితే దర్శన్ తరపు న్యాయవాది బెయిల్ దరఖాస్తు చేసుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు..? హీరో లెక్క ఎలా ఉంది అనే విషయం బయటకురావడం లేదని ఆయనకు సన్నిహితులు అంటున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications