పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ.. పెళ్లికూతురు ఎవరంటే..

జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పీ తన బ్యాచిలర్ జీవితానికి వీడ్కోలు పలికారు. వివాహ బంధంలో అడుగుపెట్టారు. తాను ప్రేమించిన అమ్మాయి లక్ష్మీప్రసన్న మెడలో మూడుముళ్లు వేశారు. ఇరువైపులా కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వరుడు, వధువు ఒకటయ్యారు. విశాఖపట్నంలోని ఓ హోటల్ లో వీరి వివాహం నవంబరు 29న జరిగింది. తాము ప్రేమ పెళ్లి చేసుకున్నామని, ప్రసన్నది వైజాగ్ అని, గతేడాది తమ నిశ్చితార్థం జరిగినట్లు ఆర్పీ వెల్లడించారు. నిశ్చితార్థానికి
వీఐపీలు, సినీ సెలబ్రిటీలు వచ్చారు. పెళ్లి మాత్రం ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో చేసుకోవాలనుకున్నామని, అందుకే గోప్యంగా ఉంచామని ఆర్పీ తెలిపారు.

కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న కిరాక్ ఆర్పీ, లక్ష్మీ ప్రసన్నల ఎంగేజ్ మెంట్ 2022 మేలో హైదరాబాద్ లో జరిగింది. వజ్ర కవచధర గోవింద, ఇదేం దెయ్యం, ఎంఎంఓఎఫ్ తదితర చిత్రాల్లో నటించిన ఆర్పీ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో హోటల్స్ నడుపుతున్నారు.

jabardasth kiraak rp marriage details

ఆ వేడుకకు 'జబర్దస్త్' ఆర్టిస్టులతోపాటు మరికొందరు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. సివిల్స్ కోచింగ్ కోసం ఆర్‌సీ రెడ్డి కోచింగ్‌ సెంటర్‌ లో జాయిన్ అయిన లక్ష్మీ ప్రసన్నని చూసిన ఆర్పీ తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడంట. ఓ సారి ఆ ఇన్‌స్టిట్యూట్‌కు అతిథిగా వెళ్లిన ఆర్పీకి అలా జరిగినట్టు సమాచారం. మొత్తానికి వీరు ప్రేమని వ్యక్త పరుచుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+