అడల్ట్ సైట్లలో మార్ఫింగ్ ఫోటోలు! స్టార్ నటి ఆవేదన!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా తన జీవితంలోని ఓ చీకటి కోణాన్ని బయటపెట్టింది. డిజిటల్ యుగంలో టెక్నాలజీ ఎంత ప్రమాదకరంగా మారుతుందో జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తనకు కేవలం 15 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే తన అనుమతి లేకుండా రూపొందించిన అసభ్యకరమైన డీప్‌ఫేక్ ఫోటోలను ఓ అడల్ట్ సైట్లో చూశానని జాన్వీ కపూర్ తన ఆవేదనను పంచుకుంది. రాజ్ శమానీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జాన్వీ కపూర్.. ఆనాటి భయంకరమైన అనుభవాలను పంచుకుంది.
స్కూల్ రోజుల్లోనే షాక్
తాను స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో ఈ ఘటన జరిగిందని జాన్వీ కపూర్ గుర్తు చేసుకుంది. ఓ రోజు స్కూల్ ఐటీ క్లాస్‌లో కంప్యూటర్ వాడుతున్న సమయంలో తోటి విద్యార్థులు సరదాగా కొన్ని వెబ్ సైట్లు చూస్తుండగా.. తన ఫోటోలు ప్రత్యక్షమయ్యాయని జాన్వీ కపూర్ వెల్లడించింది. ఆ వయసులో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి అడల్ట్ సైట్లలో పెట్టడం చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు పేర్కొంది. ఆ చిన్న వయసులో అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయానని, అది ఇంటర్నెట్‌లోని ఓ క్రూరమైన భాగమని భావించి సరిపెట్టుకున్నానని జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం చేసింది.

టెక్నాలజీ శాపమా?
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక టెక్నాలజీ పెరగడం వల్ల ఇలాంటి సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని జాన్వీ కపూర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటర్నెట్‌లో తనవని చలామణి అవుతున్న అనేక ఫోటోలు పూర్తిగా నకిలీవని, కానీ అవి చూడటానికి అచ్చం అసలు ఫోటోలలాగే ఉంటాయని జాన్వీ కపూర్ వివరించింది. ఇలాంటి ఫేక్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల సెలబ్రిటీల ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్తుందని జాన్వీ హెచ్చరించింది.
మార్ఫింగ్ ఫోటోలపై జాన్వీ యుద్ధం
డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో బాధ్యతారాహిత్యం పెరిగిపోయిందని జాన్వీ కపూర్ విమర్శించింది. ఇలాంటి అకృత్యాలు కేవలం సినీ తారలకే పరిమితం కాదని.. సాధారణ అమ్మాయిలకు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆమె గుర్తు చేసింది. సోషల్ మీడియా వాడకంపై అవగాహన,సెన్సిటివిటీ చాలా అవసరమని జాన్వీ కపూర్ అభిప్రాయపడింది. ఇప్పటికీ అలాంటి ఫోటోలు ఇంటర్నెట్‌లో కనిపించినప్పుడు తాను అసౌకర్యానికి గురవుతానని, ఇది తన ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తుందని జాన్వీ కపూర్ నిజాయితీగా ఒప్పుకుంది. తన కెరీర్‌లో జాన్వీ కపూర్ దూసుకుపోతున్నప్పటిక.., చిన్నతనంలో ఎదురైన ఈ సైబర్ వేధింపుల గాయం తన మనసులో ఇంకా పచ్చిగానే ఉందని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.
-
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. డకాయిట్ కొట్టేలా ఉన్నాడు! -
వాట్సాప్ లో కొత్త మోసం.. జాగ్రత్త: సీపీ సజ్జనార్ వార్నింగ్ -
రణ్‌బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా? -
నటి హేమ పబ్ వీడియో వైరల్.. నేనెప్పుడూ తప్పు చేయనంటూ..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..












Click it and Unblock the Notifications