రామ్ చరణ్ సినిమాలో జాన్వీకపూర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. దీనితర్వాత సానా బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమాను చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. కోడి రామ్మూర్తినాయుడు బయోగ్రీఫీగా తెరకెక్కనుందని చెబుతున్నారుకానీ దీనిపై సినిమా యూనిట్ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ను దర్శకుడు ఎంపిక చేశారు.

జాన్వీకపూర్ కు ఇది తెలుగులో రెండో చిత్రం అవుతుంది. తన మొదటి చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. దీనితర్వాత రామ్ చరణ్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా కోసం రూ.6 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. హిందీలో సినిమా చేసేందుకు రూ.3.5 కోట్ల రెమ్యునరేషన్ జాన్వీ తీసుకుంటుంది. అయితే తెలుగులోకి వచ్చేసరికి ఎక్కువ డిమాండ్ చేస్తోందంటున్నారు. బాలీవుడ్ లో తీసుకునే పారితోషికానికి డబుల్ తీసుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

janhvi kapoor remuneration details for ramcharan movie

పారితోషికాన్ని తగ్గించుకోవాలని నిర్మాత, దర్శకుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి జాన్వీకపూర్ తగ్గించుకుంటుందో? లేదంటే వారు ఇచ్చినంత, తను అడిగినంత తీసుకుంటుందేమో చూడాలి. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరిన్ని సినిమాలు ఒప్పుకునే అవకాశం ఉందంటున్నారు. బాలీవుడ్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడంతోపాటు అగ్ర కథానాయకుల చిత్రాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కనుండటంతో బాలీవుడ్ లో కూడా చేసినట్లుంటుందనే భావనలో ఈ అమ్మడు ఉందంట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+