పాము వీర్యంతో నా గొంతు కాపాడుకున్న: స్టార్ సింగర్ సంచలనం
ఏ సింగర్ కు అయినా గొంతే ముఖ్యం. గాత్రం బాగుంటేనే ఇండస్ట్రీలో రాణిస్తారు. అయితే వయసుతోపాటు సింగర్స్ కు గాత్రం తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో హాలీవుడ్ కు చెందిన స్టార్ సింగర్ తన వాయిస్ సీక్రెట్ ను బయటపెట్టారు. ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు సంచలనంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది.
హాలీవుడ్ స్టార్ సింగర్ జెస్సికా సింప్సన్ కు ప్రపంచవ్యాప్తంగా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు కారణం ఆమె పవర్ ఫుల్ వాయిస్, టాలెంట్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె సంచలన విషయాలను బయటపెట్టారు. నా శక్తివంతమైన, బలమైన వాయిస్ కు కారణం ఓ పాము వీర్యం అని కుండబద్దలు కొట్టారు. గొంతును కాపాడుకోవడానికి ఓ అరుదైన హెర్బల్ డ్రింక్ తీసుకుంటున్నానని అన్నారు.

గుడ్ వాయిస్ కోసం స్నేక్ వీర్యం తాగితే తప్పేముందని అన్నారు. ఈ ఔషధాన్ని పాము వీర్యంతో చేస్తారని తెలిపారు. దీంతో ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమెపై ట్రోలింగ్ ప్రారంభమైంది.
పాము వీర్యంతో గొంతు మారుతుందా..
చైనా ఆయుర్వేదంలో అనేక మూలికలు, జంతువుల పదార్థాలను వాడుతారు. అయితే పాము వీర్యంతో గొంతు కాపాడుకోవచ్చని శాస్త్రీయంగా ఎక్కడా నిరూపణ కాలేదు. ప్రాక్టీస్, హెల్తీ డైట్ మాత్రమే గొంతును పెంచుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.












Click it and Unblock the Notifications