ప్రణతి బర్త్ డే.. ముద్దు పేరుతో ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గతేడాది దేవర మూవీతో సంచలన విజయం తన ఖాతాలో వేసుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్ల వరకు వసూల్లు రాబట్టింది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్, బిగ్గెస్ట్ హిట్ గా ఈ మూవీ నిలిచింది. దీనికి కొనసాగింపుగా దేవర్ పార్ట్- 2పై దృష్టి పెట్టారు కొరటాల శివ. ఈ మూవీ ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

Jr NTR Celebrates Wife Pranathi s Birthday in Japan with Heartfelt Post

అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి ప్రణతితో కలిసి జపాన్ లో ఎంజాయ్ చేస్తున్నారు.జపాన్ లో ఆయన దేవర్ ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జపాన్ వెర్షన్ మార్చి 28న అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. దీంతో తారక్ జపాన్ లో మూడు రోజులుగా ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.

ఇక ఆయన సతీమణి ప్రణతి పుట్టిన రోజు మార్చి 25 మంగళవారం జరిగింది. దీంతో ప్రణతి బర్త్ డేను ఎన్టీఆర్ దగ్గరుండి గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఓ ఓ క్యూట్ ఫొటోను ఎన్టీఆర్.. తన ఇన్ స్టాలో షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే అమ్ము అంటూ రాసుకొచ్చారు. దీంతో తారకు ప్రణతిని ముద్దుగా అమ్ము అని పిలుస్తారని నెటిజెన్లు గుసగుసలాడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. హ్యాపీ బర్త్ డే ప్రణతి.. లవ్లీ కపుల్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Take a Poll

జూనియర్ ఎన్టీఆర్, ప్రణతిల వివాహం 2011లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు నందమూరి అభయ్ రామ్, నందమూరి భార్గవ్ రామ్. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మరోవైపు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 చిత్రంలోనూ ఎన్టీఆర్ నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+