సంచలనం: మొదటి ఇండియన్ సినిమాగా 'దేవర' రికార్డ్
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా అవతరించిన జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ఈనెల 27వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు కొరటాల శివ. ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకొని అత్యంత కసిగా ఆయన ఈ సినిమాను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా తొలి ఇండియన్ సినిమాగా అరుదైన రికార్డును నెలకొల్పింది.
పాటలతో రికార్డులు బద్దలు
ఈ సినిమా నుంచి విడుదలైన పాటలతో ఇప్పటికే రికార్డులను బద్దలు కొడుతున్న ఈ చిత్రం తాజాగా మరో భారీ ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవలే విశ్వవ్యాప్తంగా ఈ సినిమా టికెట్లను అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సినిమా విడుదలవడానికి ముందే ఓవర్సీస్ లో ప్రీసేల్ బుకింగ్స్ తో మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకుంది. ఉత్తర అమెరికా బాక్సాఫీస్ చరిత్రలో అత్యంత వేగంగా ప్రీసేల్ ద్వారా ఒక మిలియన్ డాలర్ల మార్క్ ను చేరుకున్న సినిమాగా రికార్డును నెలకొల్పింది. ఈ రికార్డుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ట్రైలర్ విడుదలైన తర్వాత మరిన్ని?
దేవర ట్రైలర్ ఈరోజు విడుదల కానుంది. ఇది విడుదల కావడానికి ముందే దేవర రికార్డులను నెలకొల్పడాన్ని చూస్తుంటే ట్రైలర్ విడుదలైన తర్వాత మరిన్ని రికార్డులు నెలకొల్పడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ట్రైలర్ ఏ మాత్రం ఆసక్తిని, అంచనాలను రేకెత్తించినా దేవర రికార్డులకు కొదవే ఉండదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ జరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి సోలో హీరోగా సినిమా వస్తుండటంతో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications