భారీ రికార్డు కొట్టిన ఎన్టీఆర్... సింహాసనంపై 'దేవర'
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం అభిమానుల ఆకలిని తీర్చింది. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం రూ.507 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం లాభాలపరంగా కూడా రూ.50 కోట్ల మైలురాయిని దాటింది. జాన్వీకపూర్, సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు నటించిన దేవర విజయ దశమికి వచ్చిన సెలవులను బాగా ఉపయోగించుకొని లాభపడింది.
వరుసగా రూ.150 కోట్ల షేర్
మూడు వారాలు పూర్తయ్యేసరికి ఈ సినిమా ఏపీ, తెలంగాణలో రూ.150 కోట్ల షేర్ సాధించింది. దీంతో మరో మైలురాయిని అధిగమించిన తారక్ బాక్సాఫీస్ లెక్కలు మార్చాడు. తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలతో వరుసగా రెండుసార్లు ఈ రికార్డును అందుకోగా, సలార్, కల్కి చిత్రాలతో ప్రభాస్ కూడా ఇదే రికార్డును సొంతం చేసుకున్నాడు. మిక్స్ డ్ టాక్ తో ఈ సినిమా ఈ రికార్డులను సొంతం చేసుకోవడంతోపాటు పలు రికార్డులను కొల్లగొడుతోంది. ప్రస్తుతం విడుదలైన వేట్టయాన్ కూడా యావరేట్ టాక్ సొంతం చేసుకోవడం కూడా దేవరకు కలిసివస్తోంది.

అత్యంత పకడ్బందీగా దేవర2
కొరటాల శివ దేవర1లో ఉన్న లోపాలను గమనించి, వాటిని చక్కదిద్ది అత్యంత పకడ్బందీగా దేవర2ను సిద్ధం చేస్తున్నారు. సినిమాపై ఎంత వ్యతిరేక ప్రచారం జరిగినప్పటికీ సినిమాకు ఊహించనిస్థాయిలో అభిమానులు భారీ హిట్ ను సాధించిపెట్టారు. వారి అంచనాలను రెట్టింపు చేసేలా దేవర2 ను కొరటాల తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం తారక్ వార్2, తర్వాత ప్రశాంత్ నీల్ చిత్రాలు చేస్తున్నారు. ఇవి పూర్తయిన తర్వాత దేవర2 షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇకనుంచి ఏడాదికో సినిమా విడుదల చేయాలని జూనియర్ ఎన్టీఆర్ ప్రణాళిక రచించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications