నంద్యాలలో 'దేవర' సంచలన రికార్డు
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం వారం రోజులు దాటినప్పటికీ కలెక్షన్ల విషయంలో సంచలన రికార్డులు నెలకొల్పుతూ ముందుకు దూసుకువెళుతోంది. సినిమా విడుదల రోజు మిక్స్ డ్ టాక్ అందుకున్నప్పటికీ కలెక్షన్లపై దాని ప్రభావం పడలేదు. సినిమాపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో ఈ సినిమా వారం రోజులకు రూ.405 కోట్లు వసూలు చేసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా పోస్టర్ విడుదల చేసింది.
బ్రేక్ ఈవెన్ అయింది
ఏపీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. ఈ దసరా సెలవుల్లో వచ్చేదంతా లాభమేనని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. వాస్తవానికి వచ్చిన కలెక్షన్ల లెక్క ఒకటైతే, నిర్మాణ సంస్థ మాత్రం మరోలా చెబుతోందంటూ విమర్శలు వస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా తెలుగు, కన్నడం, హిందీలో భారీ కలెక్షన్లు రాబడుతున్నప్పటికీ తమిళం, మళయాళంలో వెనకబడింది. ఓవర్సీస్ లో మాత్రం అదిరిపోయే స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది. తాజాగా ఈ సినిమా రాయలసీమలో ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది.

ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర
నంద్యాలలో దేవర కోటిరూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇది సంచలన రికార్డు అని, సీడెడ్ అనేది జూనియర్ ఎన్టీఆర్ అడ్డా అని, తిరుగులేదని, నంద్యాలలో ఇంకా కలెక్షన్లు పెరుగుతాయని అభిమానులు చెబుతున్నారు. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రమే నంద్యాలలో కోటిరూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా ఈ రికార్డును అధిగమించాడు. హిందీ వెర్షన్ లో రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లకు చేరువలో ఉంది. రోజురోజుకు అక్కడ ఆదరణ పెరుగుతోంది. ఉత్తరాది ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. దసరా సెలవులు అయిపోతేకానీ మొత్తంగా దేవరకు ఎంత కలెక్షన్ వచ్చిందనే విషయంలో ఓ స్పష్టత వస్తుంది. వరుసగా సెలవులు రావడం ఈ సినిమాకు బాగా కలిసివచ్చింది.












Click it and Unblock the Notifications