మహారాష్ట్రలో దుమ్ము రేపుతున్న 'దేవర'

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన చిత్రం దేవర. గత నెలలో పాన్ ఇండియా సినిమాగా దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీలో విడుదలైంది. మొదటిరోజు రూ.172 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. లాంగ్ రన్ లో రూ.600 కోట్లను చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దేవర విడుదల రోజే మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, వ్యతిరేకంగా ప్రచారం జరిగినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాస్ లో తనకున్న క్రేజ్ తో, తన స్టామినాతో సినిమాను బ్లాక్ బస్టర్ చేస్తూ విజయతీరాలకు చేర్చారు.

ఇప్పటివరకు రూ.60 కోట్లు
ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేసింది. ఇప్పటివరకు హిందీ వెర్షన్ లో రూ.60 కోట్ల వరకు వసూలు చేసింది. దీపావళి ఒక్కరోజే కోటిరూపాయల గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా మంచి లాంగ్ రన్ తో వసూళ్లు దక్కించుకోవడంపై ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోతున్నారు. ప్రధానంగా ఈ సినిమా మహారాష్ట్రలో దుమ్ము రేపుతోందని చెప్పొచ్చు. అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇటీవలే విడుదలైన హిందీ చిత్రాలకు మహారాష్ట్రలోని సింగిల్ థియేటర్ల నుంచి ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. దీంతో థియేటర్లను మూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

junior ntr devara new records create maharashtra single screens

మహారాష్ట్రలో మినిమం కలెక్షన్లు
సరిగ్గా ఇటువంటి తరుణంలో విడుదలైన దేవర చిత్రానికి మాత్రం ఈరోజు వరకు థియేటర్ల నుంచి మినిమం కలెక్షన్లు వస్తున్నాయి. ఒకరకంగా మహారాష్ట్రలోని సింగిల్ స్క్రీన్లను ఈ సినిమా బతికించిందంటున్నారు. వారాంతంలో కూడా దేవరకు డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి దేవర రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. తమిళనాడు, కేరళలోనే అనుకున్నస్థాయిలో కలెక్షన్లు రాలేదు. అయితే విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవడంతోపాటు డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను కట్టబెట్టింది. కొరటాల శివ దర్శకత్వ ప్రతిభకన్నా ఎన్టీఆర్ నటన, అనిరుధ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+