'దేవర' ఫస్ట్‌డే షోలను హోల్ సేల్ గా కొన్న అభిమానులు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం దేవర ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఆయుధపూజ పాటను విడుదల చేయాల్సి ఉంది. 27వ తేదీ శుక్రవారం రాగా, 26వ తేదీ గురువారం అర్థరాత్రి నుంచే షోలు పడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి పశ్చిమగోదావరి జిల్లా హక్కులను ఆదిత్య ఫిలిమ్స్ అధినేత ఎల్వీఆర్ సొంతం చేసుకున్నారు. దాదాపు ఈ ఉమ్మడి జిల్లా హక్కులు రూ.6 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.
సినిమాను ఎక్కువగా అభిమానించే గోదావరి జిల్లాల్లో మాత్రం దేవర ఫీవర్ మాములుగా లేదు. ఆరు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్న చిత్రం కావడంతో అభిమానులు భీభత్సమైన హడావిడి చేస్తున్నారు. ఏ, బీ సెంటర్లకన్నా సీ సెంటర్లలో అయితే హంగామా ఒక స్థాయిలో ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలోని సీ సెంటర్ లో తొలిరోజు ఆరు షోలను కలిపి ఇద్దరు అభిమానులు హోల్ సేల్ గా రూ.5.40 లక్షలకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు. ఈ కేంద్రం పేరు బయటకు రాలేదు.

అలాగే ఇదే జిల్లాలోని కామవరపుకోటలో అర్థరాత్రి షోను ఎన్టీఆర్ అభిమాని ఒకరు రూ.2 లక్షలకు సొంతం చేసుకున్నారు. గురువారం అర్థరాత్రి నుంచే డీజేలు, బాణాసంచా, డ్యాన్సులతో సంబరాలు చేసుకోబోతున్నారు. ఇక్కడ ఎన్టీఆర్ ది 25 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లాలో అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికంటే ముందుగా షోలు వేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని థియేటర్లకన్నా తమదగ్గరే మొదటి షో పడాలంటూ డిస్ట్రిబ్యూటర్ పై ఒత్తిడి తెస్తున్నారు. భీమడోలు, నల్లజర్లలో కూడా అభిమానులు హంగామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సినిమా ఏమాత్రం బాగుందనే చిన్న టాక్ వచ్చినా వీరే చేసే హంగామా మాత్రం ఒక రేంజ్ లో ఉంటుందంటున్నారు.












Click it and Unblock the Notifications