'దేవర' ఇన్‌సైడ్ టాక్: అదిరిందంటున్నారు!
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా అవతరించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. జాన్వీకపూర్ కథానాయికగా నటించగా, అనిరుధ్ రవిచందర్ స్వరాలందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ కల్యాణ్ రామ్, యువసుధ ఆర్ట్స్ మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మించారు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి సోలో హీరోగా సినిమా వస్తోంది.
తెలుగుకు బ్లాక్ బస్టర్ అవసరం
తారక్ ప్రస్తుతం పాన్ వరల్డ్ హీరోగా మారిపోవడంతో దర్శకుడు కొరటాల యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ తరహాలో తీర్చిదిద్దినట్లు సమాచారం. ప్రొడక్షన్ విలువలు చాలా బాగున్నాయని, కళ్లు చెదిరేలా తీశారంటున్నారు. సినిమామీద టీం సంతృప్తిగా ఉందంటున్నారు. ఈ ఏడాది తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమా చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఒక స్టార్ హీరో నుంచి తెలుగుకు బ్లాక్ బస్టర్ రావడం చాలా అవసరం అంటున్నారు విశ్లేషకులు. అందుకే తారక్ అభిమానులు ఎంతలా అయితే ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారో తెలుగు సినీ పరిశ్రమ కూడా అలాగే ఎదురుచూస్తోంది.

షోలు పెరిగితే మూడు మిలియన్ డాలర్లు
ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ కు ఇబ్బంది ఉండదని, మూడువారాలు కంటిన్యూగా మంచి కలెక్షన్లు వస్తాయంటున్నారు. ప్రస్తుతం నార్త్ అమెరికా నుంచి 20వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఆల్ టైం ఇండియన్ రికార్డు అని చెబుతున్నారు. వచ్చేవారంలో ప్రదర్శించే షోలు పెరిగితే సులువుగా ఒక మిలియన్ గ్రాస్ మార్క్ దాటేస్తుంది. ప్రీయిర్ షోల నుంచి మూడు మిలియన్ డాలర్లు రాబడుతుందంటున్నారు. అభిమానులు పెట్టుకున్న అంచనాలు అందుకుంటుందా? అనే టెన్షన్ మాత్రం అందరిలో ఉంది. కొరటాల శివ ఒక రొటీన్ కమర్షియల్ డ్రామాగా తీశాడని తెలుగు ఫిలింనగర్ వర్గాలంటున్నాయి. స్క్రీన్ ప్లే ముఖ్యమని, ఆచార్య కాకుండా తన గత సినిమాల మాదిరిగా సన్నివేశాలను కొరటాల శివ తీర్చిదిద్దాడని, అవే సినిమాకు హైలైట్ గా నిలవబోతున్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications