విడాకులపై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన జ్యోతిక..!
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తమిళ స్టార్ హీరో సూర్య అతని భార్య జ్యోతిక విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి అందరికి తెలిసిందే. సూర్యతో అభిప్రాయభేదాలు తలెత్తడంతో..జ్యోతిక ఏకంగా ముంబైకి తన మకాన్ని మార్చిందనే కథనాలు వెలువడ్డాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. జ్యోతిక చైన్నైని వదిలి ముంబైకి తన మకాంను మార్చింది.
పిల్లలతో సహా జ్యోతిక ముంబైకి వెళ్లిపోవడంతో సూర్యతో జ్యోతిక విడాకులు తీసుకుంటుందనే అందరు భావించారు. సూర్య ఒక్కడే అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడంతో.. సూర్య - జ్యోతిక విడాకుల వార్తలు నిజమే అనుకున్నారు. విడాకులపై వస్తోన్న వార్తలను అటు సూర్య కానీ ఇటు జ్యోతిక ఎవరూ ఖండించకపోవడంతో వారి అభిమానులు నిరాశలో కురుకుపోయారు.

అయితే ఇటీవలే విడాకులు తీసుకుంటున్నారని వస్తోన్న పుకార్లపై జ్యోతిక క్లారిటీ ఇచ్చారు.తాను వరుసగా బాలీవుడ్ సినిమాలు కమీట్ అయ్యానని..అందుకే ముంబై వచ్చానని.. దీనికి తోడు పిల్లల చదువు కోసం కూడా ముంబైకి రావాల్సి వచ్చిందని జ్యోతిక తెలిపారు. అంతే కాని నాకు సూర్యకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. పిల్లలు చదువు పూర్తి కాగానే తిరిగి చైన్నై వెళ్లిపోతామని ఆమె చెప్పుకొచ్చారు.
సూర్య కూడా షూటింగ్ గ్యాప్ దొరికితే తమ దగ్గరకు వచ్చి వెళ్తున్నారని జ్యోతిక చెప్పుకొచ్చారు. తాజాగా తమ విడాకుల గురించి చర్చించుకుంటున్న నెటిజన్లకు గట్టి షాకిచ్చారామె. భర్త సూర్యతో కలిసి వేకేషన్‌కు వెళ్లిన వీడియోను షేర్ చేసి ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. దీంతో సూర్య - జ్యోతిక జంట విడాకులపై వస్తోన్న రుమార్స్‌కు చెక్ పెట్టినట్టు అయింది.












Click it and Unblock the Notifications