ఓటీటీలో ప్రభాస్ కల్కి.. ఎప్పుడు.. ఎందులో అంటే!

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 1200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి కొత్త రికార్డును సృష్టించిందని సినీవర్గాలలో చర్చ జరుగుతుంది. థియేటర్లలో చూసిన ప్రతి ఒక్కరిని ఫిదా చేసిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతుందని ఆసక్తికరమైన అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

కల్కి అప్డేట్స్ పై జనాల ఆసక్తి
కల్కి సినిమాని థియేటర్లలో చూసినవారు కూడా ఓటీటీలో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సహజంగా భారీ బడ్జెట్ సినిమాలు అంత త్వరగా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉండదు. కానీ కల్కి సినిమా ఓటీటీలో వస్తే చూడాలని ఎదురుచూస్తున్న వారు కూడా లేకపోలేదు. అయితే ఓటిటిలో కల్కి ఎంట్రీకి సంబంధించిన అప్డేట్స్ ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్నాయి.

Kalki OTT Streaming Date Fix When Where

కల్కి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై చర్చ
ఓటీటీలో స్ట్రీమింగ్ కు డేట్ ఫిక్స్ అయిందని తాజాగా చర్చ జరుగుతుంది. కల్కి మూవీ అనుకున్న టార్గెట్ ను ఎప్పుడో రీచ్ అయింది. 1200 కోట్ల రూపాయల వసూలు చేసి సినిమా సర్ప్రైజ్ ఇచ్చింది. రెబెల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గా కల్కి తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

ఓటీటీలో కల్కి ఇందులోనే... ఇప్పటినుండే
సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా త్వరలో ఎంట్రీ ఇస్తుందని టాక్ వినిపిస్తుంది. ఆగస్టు 23 నుంచి ఈ సినిమా హిందీ వెర్షన్ ను నెట్ఫ్లిక్స్ లోను, మిగిలిన వెర్షన్స్ ను అమెజాన్ ప్రైమ్ లోను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దాదాపు స్ట్రీమింగ్ డేట్ ఇదే ఫిక్స్ అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే దీనిపైన త్వరలోనే మూవీ మేకర్స్ క్లారిటీ ఇస్తారని కూడా టాక్ వినిపిస్తుంది.

కల్కి సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగ
మహాభారతంలో నుంచి తీసుకున్న ఇతివృత్తంతో తీసిన ఈ సినిమా చాలా హైప్ క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్ కి ముందే సినిమా అర్థం కావడం కోసం బుజ్జి మరియు భైరవ పేరుతో యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ చేయడం కూడా సినిమాకు విపరీతమైన క్రేజ్ తీసుకువచ్చింది. ప్రతి విషయంలోనూ ప్రత్యేకంగా నిలిచిన కల్కి సినిమా ఓటీటీలో కూడా త్వరలోనే రాబోతుందన్న వార్తలు ఎంత నిజమో తెలియదు కానీ ఆగస్టు నెలలో స్ట్రీమింగ్ కి వస్తే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+