నెక్స్ట్ మూవీ కోసం పూరీ బడా ప్లాన్.. రంగంలోకి బాలయ్య విలన్
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతితో.. టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ సినిమా చేస్తున్నారు. రీసెంట్ గానే అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఉండబోతుందని.. ఈ మూవీతో పూరీ గట్టి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో క్యాస్టింగ్‌ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు పూరీ.
ఇక ఇప్పటికే ఈ మూవీలో సీనియర్ నటి టబు నటిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' తర్వాత ఏ తెలుగు సినిమాను ఒప్పుకోని టబు.. ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పూరీ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చి ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు మూవీ యూనిట్. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో నటిస్తున్నట్టు ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈ మూవీలో ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహ రెడ్డి సినిమాతో నటించారు విజయ్. బాలయ్యకు తగ్గ విలన్ అంటూ అద్భుతంగా నటించారు. దాంతో ఇప్పుడు విజయ్ సేతుపతితో.. దునియా విజయ్ తలపడే సీన్స్ ఎలా ఉంటాయోనని భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
మరోవైపు ఈ సినిమాకు 'బెగ్గర్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడీగా రాధికా ఆప్టే నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. తెలుగులో రక్తచరిత్ర, లయన్, ధోనీ, లెజెండ్ సినిమాల్లో నటించింది. అలానే బాలీవుడ్ లో సైతం పలు సినిమాల్లో, వెబ్ సిరీస్ లల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. తెలుగులో ఉప్పెన, సైరా సినిమాల్లో నటించారు. దళపతి విజయ్ హీరోగా వచ్చిన 'మాస్టర్ ' సినిమాలో తన విలనిజంతో అందర్నీ ఆకట్టుకున్నాడు. రీసెంట్ గానే మహారాజా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ పూరీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రంపై అంచనాలు పెరిగాయి.
From the land of Karnataka to the heart of audiences across the nation❤️🔥
— Puri Connects (@PuriConnects) April 28, 2025
Team #PuriSethupathi Proudly Welcomes the Sandalwood dynamo, Actor #VijayKumar @OfficialViji on-board for an electrifying role that will leave everyone spellbound 💥
A #PuriJagannadh Film
Starring… pic.twitter.com/T0LXN9OhUM
-
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు












Click it and Unblock the Notifications