హీరోయిన్లతో శృంగారంపై స్టార్ హీరో భార్య షాకింగ్ కామెంట్స్

ఒకప్పుడు సినిమాలు కుటుంబ సమేతంగా కూర్చొని చూడదగే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారడంతో సినిమాలు కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగా మారుతున్నాయి. నేటి తరం సినిమాల్లో ముద్దు సీన్లతో పాటు, శృంగారభరిత సన్నివేశాలతో నింపేస్తున్నారు. దీంతో థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియోన్స్ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడు సినిమాలో ముద్దు సీన్లు ఉంటే వార్త. ఇప్పుడు ఎన్ని ముద్దు సీన్లు ఉన్నాయ్, బెడ్ రూమ్ సీన్స్‌లో ఎంత హాట్‌గా కనిపించారనే దాని గురించే చర్చ జరుగుతోంది. అయితే ఓ హీరోయిన్ శృంగారభరిత సన్నివేశాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు కరీనా కపూర్.

బాలీవుడ్‌లో కరీనా కపూర్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన కరీనా కపూర్ ..ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సల్మాన్, షారుక్ వంటి స్టార్ హీరోలతో నటించి ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది.బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌తో కరీనా కపూర్‌ ప్రేమయాణం సాగించింది. వీరిద్దరు కొన్నాళ్లు రిలేషన్‌లో ఉన్నారు.పెళ్లి చేసుకుంటానుకున్న వీరిద్దరు అభిప్రాయభేదాలు తలెత్తడంతో విడిపోయారు. షాహిద్‌తో బ్రేకప్ తర్వాత సైఫ్ అలీ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికే పెళ్లై తన వయస్సు కూతురున్న వ్యక్తిని కరీనా ప్రేమించి పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనమే సృష్టించింది.ఇద్దరు పిల్లలకు తల్లైనా ఫిజిక్‌ను మెయింటైన్ చేయడంలో కరీనా కపూర్ తర్వాతే ఎవరైనా.

Kareena Kapoor comments on erotic scenes in movies

తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. హాలీవుడ్ స్టార్ గిలియన్ అండర్సన్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.ఈ సందర్భంగా తెర మీద వచ్చే శృంగార సన్నివేశాల గురించి కరీనా కపూర్ స్పందించింది. సినిమాను ముందుకు తీసుకువెళ్లడంలో సెక్స్ సీన్లు ఉండాల్సిన అవసరం లేదని ఈ హాట్ బ్యూటీ చెప్పుకొచ్చింది.తెర మీద అలాంటి సీన్లను చేయడానికి నేను కంఫర్ట్‌గా ఫీల్ కాను.అందుకే నా కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క సెక్స్ సీన్లలో కూడా నటించలేదని చెప్పుకొచ్చింది. మన దేశంలో సెక్స్ గురించి ఇంకా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా సెక్స్ గురించి మనం ఇంకా ఓపెన్‌గా దీని గురించి మాట్లాడటం లేదని కరీనా అభిప్రాయపడింది. పాశ్చాత్య దేశాల్లో అమ్మాయిల సెక్స్ కోరికలకు గౌరవం ఉంటుందని, కానీ ఇండియాలో అలా ఉండదని, ఇక్కడ అమ్మాయిలు చాలా రిజర్వ్‌డ్‌‌గా ఉంటారని ఈ సీనియర్ హీరోయిన్ వెల్లడించింది. ఇలా తెర మీద వచ్చే సెక్స్ సన్నివేశాల గురించి కరీనా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+