సందీప్ కిషన్ ఫాంటసీ విశ్వం.. నాగలోకం, వానర లోకంతో విజువల్ వండర్!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో సందీప్ కిషన్ వరుస వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన హీరోగా, షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్న భారీ చిత్రం 'కరికాల' గురువారం నాడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. యుగంధర్ ముని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఆ టాలీవుడ్ యంగ్ హీరోతో మమితా బైజు వివాహం..? క్లారిటీ ఇచ్చిన మలయాళం బ్యూటీ
ఆ టాలీవుడ్ యంగ్ హీరోతో మమితా బైజు వివాహం..? క్లారిటీ ఇచ్చిన మలయాళం బ్యూటీ

ఆది గౌరవ దర్శకత్వం

ఈ ప్రారంభోత్సవంలో టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత రాజశేఖర్ తల్లి సత్యవతి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మహిధర్ రెడ్డి తల్లి పద్మారెడ్డి క్లాప్ కొట్టి ముహూర్తపు సన్నివేశాన్ని ప్రారంభించారు. నిర్మాత రాజశేఖర్ తండ్రి వీరభద్రాచారి చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందించారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో కథానాయికలు కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. తన మిత్రుడు ఆది సాయి కుమార్ వల్లే ఈ చిత్ర దర్శకుడు, నిర్మాతలు పరిచయమయ్యారని తెలిపారు.

Karikala Sundeep Kishan Ambitious Project Kicks Off on a Grand Note

దర్శకుడు యుగంధర్ రెండు భాగాలుగా ఈ కథను చెప్పినప్పుడు ఒక్క నిమిషం కూడా బోర్ అనిపించలేదు. ఆరేడు నెలలుగా దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇలాంటి ప్యాషన్ ఉన్న దర్శక, నిర్మాతలు దొరకడం నా అదృష్టం. 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. శ్రీచరణ్ పాకాల అద్భుతమైన ఆల్బమ్‌ను సిద్ధం చేస్తున్నారు" అని విశ్వాసం వ్యక్తం చేశారు.

'హనుమాన్ అంశ్' చిత్రాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో అతనేనా..? చేసుంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దలే..!
'హనుమాన్ అంశ్' చిత్రాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో అతనేనా..? చేసుంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దలే..!

అందమైన చందమామ కథలా

దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ ఈ సినిమా ప్రపంచాన్ని వివరించారు. ఈ చిత్రం ఒక అందమైన చందమామ కథలా ఉంటుందని, ప్రేక్షకులను పూర్తిగా ఒక మాయా లోకంలోకి తీసుకెళ్తుందనడంలో సందేహం లేదన్నారు. కథలో భాగంగా ప్రత్యేకమైన ఊహా ప్రపంచం, నాగలోకం, వానర లోకం వంటి విభాగాలను ఎంతో గ్రాండియర్‌గా సృష్టించబోతున్నట్లు వెల్లడించారు. వచ్చే వారం నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఒకే ఏడాదిలోనే కొన్ని నెలల వ్యవధిలో రెండు భాగాలను విడుదల చేసేలా మేకర్స్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అద్భుతమైన సాంకేతికత, సరికొత్త ఫాంటసీ ప్రపంచంతో రాబోతున్న 'కరికాల' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+