Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Karthika deepam 2 December 18th:వైరాతో జ్యోత్స్న జత..సీఈవో పోస్ట్ కోసం కొత్త కుతంత్రం!

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న 'కార్తీకదీపం 2' సీరియల్ ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపులు తిరుగుతోంది. నిన్నటి ఎపిసోడ్‌లో దీప ఇచ్చిన వార్నింగ్‌కు జ్యోత్స్న భయపడటం, కాశీని తనవైపు తిప్పుకోవడానికి జ్యోత్స్న ప్రయత్నించడం వంటివి చూశాం. మరి నేడు డిసెంబర్ 18వ తేదీ, 544వ ఎపిసోడ్‌లో జరిగిన ఆసక్తికర పరిణామాలు ఇప్పుడు చూద్దాం.

నానమ్మకు శౌర్య చురకలు..
నేటి ఎపిసోడ్ ప్రారంభంలో కాంచన మనసులో చాలా బాధతో ఉంటుంది. శ్రీధర్ ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి దీప తనతో సరిగ్గా మాట్లాడకపోవడం ఆమెను కలచివేస్తుంది. అదే సమయంలో శౌర్య అన్నం తినకుండా అల్లరి చేస్తుంటే కాంచన కోప్పడుతుంది. అయితే, శౌర్య చెప్పిన మాటలకు అందరూ షాక్ అవుతారు. "నానమ్మ మంచిది కాదు.. తాతయ్యను నానమ్మ దగ్గరకు పంపకుండా చేసింది" అంటూ శౌర్య తనదైన శైలిలో నిలదీస్తుంది.

Karthika deepam 2 Serial December 18th Episode 544 Here is todays full story

తన ఫ్రెండ్స్ అందరికీ తాతయ్య, నానమ్మలు కలిసి ఉన్నారని, మరి తనకు ఎందుకు లేరని ప్రశ్నిస్తుంది. శౌర్య మాటలకు కదిలిపోయిన కాంచన.. దీప కొట్టబోయినా ఆపి, చిన్నారిని దగ్గరకు తీసుకుంటుంది. "మీ తాతయ్యను నాన్నతో పిలిపిస్తానులే" అని కాంచన చెప్పడంతో.. శౌర్య చేసిన పనికి కార్తీక్, దీపలు సంతోషిస్తారు. అయితే కాంచన మనసు ఇంకా పూర్తిగా మారలేదని కార్తీక్ నిరాశ చెందుతాడు.

జ్యోత్స్న మాయలో కాశీ..శ్రీధర్ ఆగ్రహం!
మరోవైపు, జ్యోత్స్న చెప్పిన చెప్పుడు మాటలు కాశీ మనసుపై బాగా ప్రభావం చూపాయి. శ్రీధర్ వద్ద బిజినెస్ విషయాలు మాట్లాడుతున్నప్పుడు కాశీ ఈగో అడ్డు వస్తుంది. "మీ దగ్గర పనిచేస్తే నేను బానిసలా బతకాల్సిందే" అని మనసులో అనుకుంటాడు. పనిపై ఫోకస్ లేదని శ్రీధర్ మందలించగా.. "ఫుడ్ ట్రక్స్ చూడటం ఒక పనేనా?" అన్నట్టుగా కాశీ మాట్లాడతాడు. దీంతో శ్రీధర్ సీరియస్ అయి, కాశీని ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నానని చెబుతాడు. భయపడిపోయిన స్వప్న సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. చివరకు కాశీ క్షమాపణలు చెప్పి సర్దుకుంటాడు. కానీ, జ్యోత్స్న వేసిన ప్లాన్ ప్రకారం కాశీ లోపల అసంతృప్తి రగులుతూనే ఉంటుంది.

వైరాతో జ్యోత్స్న జత.. సీఈవో పోస్ట్ కోసం కొత్త కుతంత్రం!
ఎపిసోడ్‌లో అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే.. జ్యోత్స్న తన ఫ్యామిలీకి శత్రువు అయిన వైరాని కలవడం. గతంలో వేలంపాటలో వైరాను ఓడించిన జ్యోత్స్న.. ఇప్పుడు అతడితో చేతులు కలిపింది. తనకు మళ్లీ రెస్టారెంట్‌కు సీఈవో పోస్ట్ కావాలని, ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కార్తీక్ లేదా శ్రీధర్ మళ్లీ అటువైపు రాకూడదని వైరాకు ఆఫర్ ఇస్తుంది. ఇందుకోసం కాశీని అడ్డుపెట్టుకోవాలని, అతడికి వైరా దగ్గర ఉద్యోగం ఇప్పించాలని జ్యోత్స్న కోరుతుంది. వైరా దీనికి ఓకే చెప్పినా.. తన దగ్గరకు వచ్చిన జ్యోత్స్నకు తన పవరేంటో చూపిస్తానని తన అనుచరుడితో చెబుతాడు. అంటే జ్యోత్స్న వేసిన ప్లాన్ ఆమెకే రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది.

జ్యోత్స్న నిజంగానే ఆ ఇంటి వారసురాలేనా?
ఎపిసోడ్ ముగింపులో దీప, కార్తీక్ జ్యోత్స్న గురించి చర్చించుకుంటారు. జ్యోత్స్న కాశీని తన రూమ్‌లోకి పిలిపించి ఏదో ప్లాన్ చేస్తోందని దీప అనుమానిస్తుంది. ఈ క్రమంలో కార్తీక్ ఒక షాకింగ్ విషయం చెబుతాడు. జ్యోత్స్న చేస్తున్న మోసాలు చూసి.. అసలు ఆమె ఆ ఇంటి వారసురాలేనా అని తన తండ్రి శ్రీధర్ అనుమానం వ్యక్తం చేశాడని కార్తీక్ అంటాడు. మరోవైపు అత్తయ్య-మావయ్యలను కలపడానికి ఒక బలమైన సంఘటన జరగాలని దీప కోరుకుంటుంది.

జ్యోత్స్న వైరాతో కలిసి ఆడుతున్న నాటకం ఎటు దారి తీస్తుంది? కాశీ నిజంగానే జ్యోత్స్న మాటలు నమ్మి మోసపోతాడా? శ్రీధర్ అనుమానం నిజమవుతుందా? అనేది రాబోయే ఎపిసోడ్లలో చూడాల్సిందే!

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+