Karthika deepam 2 October 13th Episode:తాత కోరికకు కార్తీక్ సమ్మతం!దీప ధైర్యానికి జ్యోత్స్న షాక్!
కంపెనీ షేర్ల విషయంలో వైరా ప్లాన్‌ను అడ్డుకున్న కార్తీక్‌పై వైరా పగతో రగిలిపోయాడు. తన దారికి అడ్డు వస్తే కార్తీక్ ఫ్యామిలీకి ప్రమాదమని వైరా వార్నింగ్ ఇవ్వగా, **"పోతురాజు"**లా నరుకుతానని కార్తీక్ తిరిగి హెచ్చరించాడు. మరోవైపు, సీఈఓ పదవి నుంచి వైదొలగమని శివన్నారాయణ గట్టిగా చెప్పడంతో జ్యోత్స్న షాక్ అయ్యింది. తండ్రిపై కోపంతో కాశీ, దాస్‌ను చేతకాని తండ్రి అని తిట్టగా.. శ్రీధర్ సర్దిచెప్పాడు. దీప పుట్టుక గురించి శ్రీధర్ దాస్‌ను నిలదీశాడు.
నేటి ఎపిసోడ్ (అక్టోబర్ 13)లో ఏం జరిగిందంటే?
కంపెనీ సమస్యలతో తాను బాధపడుతున్నానని, ఈ 'సముద్రాన్ని' ఈదలేనని శివన్నారాయణ మనసులో మాటను కార్తీక్‌తో పంచుకున్నాడు. తనకు 'కత్తి లాంటి సాలీడ్ ప్లేయర్' కావాలని, అది కార్తీక్ మాత్రమేనని అంటాడు.మొదటి కోరికలో భాగంగా బోర్డ్ మీటింగ్‌లో, కంపెనీలో కార్తీక్ ఉంటాడని ఇచ్చిన మాటను నిజం చేయాలి,రెండవ కోరికగా దశరథ, సుమిత్రలను తిరిగి కలపాలి.ఈ రెండు కోరికలు తీరుస్తానని కార్తీక్ మాటిస్తాడు. "నా కుటుంబ సామ్రాజ్యాన్ని కూలిపోకుండా కాపాడాల్సిన బాధ్యత నీదే" అని చెప్పి శివన్నారాయణ అక్కడి నుండి వెళ్లిపోతాడు. తాత అప్పగించిన పెద్ద బాధ్యత గురించి కార్తీక్ ఆలోచనలో పడతాడు.

దీప ముందు జ్యోత్స్న పరువు పోయింది!
కార్తీక్, శివన్నారాయణల సంభాషణను విన్న జ్యోత్స్న, కార్తీక్‌ని వెటకారం చేయాలని చూడగా... దీప రంగంలోకి దిగింది. "మీరు చేతకాని పనులు మానేయండి" అని దీప ధైర్యంగా అంటుంది. జ్యోత్స్న తనను 'పనిమనిషి' అని అవమానించగా, దీప ఏ మాత్రం తగ్గకుండా "మీరున్న ప్లేస్‌లో ఉండే అర్హత మీకుందా?" అని నిలదీస్తుంది.
దాంతో షాక్ అయిన జ్యోత్స్న... దీపకు నిజం తెలిసిపోయిందా? అందుకే ఈ మాటలు అంటోందా? అని మనసులో భయపడుతుంది. "మీరుండే ప్లేస్ అంటే జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కు సీఈఓ కదా" అని దీప అనడంతో... జ్యోత్స్న నిట్టూర్చుతుంది. అయినప్పటికీ మారకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని దీప హెచ్చరిస్తుంది.
కాశీకి చివరి అవకాశం!
టిఫిన్ కోసం రాక గొడవ చేసిన కాశీ, ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అనడంతో అంతా ఆందోళన పడతారు. ఉద్యోగ వేట వదిలేసి, హాయిగా తమ బిజినెస్‌లు చూసుకోమని శ్రీధర్ సూచిస్తాడు. తనకు బిజినెస్ అంటే ఇష్టం లేదని కాశీ అనడంతో... రేపు సాయంత్రం వరకు జాబ్ దొరికితే ఓకే, లేదంటే ఎల్లుండి నుంచి బిజినెస్ చూసుకోవాల్సిందేనని శ్రీధర్ కండీషన్ పెడతాడు.
కార్తీక్ సహాయం కోరిన జ్యోత్స్న
సీఈఓ పదవిని కాపాడుకోవడానికి జ్యోత్స్న, కార్తీక్‌ని రెస్టారెంట్‌కు పిలిచి సాయం అడుగుతుంది. తన తల్లిదండ్రులు (దశరథ, సుమిత్ర) కలిస్తే, తను సీఈఓగా కొనసాగడానికి కార్తీక్ సపోర్ట్ చేస్తావా? అని అడుగుతుంది. కార్తీక్ ఆశ్చర్యపోతాడు.
కార్తీక్‌తో మాట్లాడి ఇంటికి వచ్చిన జ్యోత్స్న.. అందరినీ పిలిచి, తన తండ్రి దశరథ పక్కన తల్లి సుమిత్రని నిల్చోబెడుతుంది. అది చూసిన దశరథ కోపంగా పక్కకి వెళ్లిపోవడంతో ఎపిసోడ్ ఉత్కంఠగా ముగుస్తుంది.కార్తీక్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా? దశరథ, సుమిత్రలు కలుస్తారా? తదుపరి ఎపిసోడ్‌లో చూడాలి!












Click it and Unblock the Notifications