Karthika deepam 2 September 10th Episode:జ్యోత్స్నకు పెద్ద షాక్..కార్తీక్‌కు తెలిసిన కొత్త నిజం!

తెలుగింట సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న కార్తీక దీపం సీరియల్ 459వ ఎపిసోడ్ చాలా బాగా సాగిందది. కార్తీక్ తెలివిగా రెస్టారెంట్ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించడం చూసి శివ నారాయణ సంతోషిస్తాడు. కానీ జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ భారీ నష్టాల్లో ఉండటంతో ఆమెపై మండిపడతాడు. నష్టాలకు ఉద్యోగులనే కారణమని జ్యోత్స్న ఆరోపించగా, "మీకు అది కేవలం ఒక నిర్ణయం కావచ్చు, కానీ వాళ్లకు అది జీవితం" అని దీపా బదులిస్తుంది. దాంతో జ్యోత్స్న కోపంగా దీపాను పనిమనిషిగా అంటుంది.

దీపకు శివ నారాయణ సపోర్ట్ చేయడంతో జ్యోత్స్నలో ఆగ్రహం పెరుగుతుంది. శివ నారాయణ కంపెనీ ఆడిటింగ్ చేయిస్తానని చెప్పడంతో జ్యోత్స్న భయపడుతుంది. మరోవైపు, కాశీకి ఉద్యోగం పోయిందన్న మెసేజ్ రావడంతో కారు ప్రమాదానికి గురవుతాడు. కార్తీక్ బాబు శ్రీధర్‌కు ఫోన్ చేసి ఇకనైనా బాధ్యతగా ఉండాలని హితవు పలుకుతాడు.

Karthika deepam 2 Serial September 10th 2025 Episode 459 Here is the Today s full story

సెప్టెంబర్ 10, ఎపిసోడ్ 459:
తన నిర్ణయాలకు బాధ్యతగా ఉండాలని సుమిత్ర జ్యోత్స్నకు హెచ్చరిస్తుంది. దీపా చెప్పిన మాటలనే సుమిత్ర చెబుతుండటంతో కార్తీక్, జ్యోత్స్న ఆశ్చర్యపోతారు. అదే సమయంలో కాశీ కారు ప్రమాదం గురించి స్వప్న ఇంట్లో వాళ్లకు చెబుతుంది. కాశీని పోలీసులు పట్టుకుపోయారని, ఒకవేళ చనిపోతే ఆయన జైలుకు వెళ్తారని స్వప్న ఏడుస్తుంది. ఈ ఘటనకు సంతోషిస్తున్నారని స్వప్న తన తండ్రి శ్రీధర్‌పై కోపంగా అరుస్తుంది. కానీ శ్రీధర్ మౌనంగా ఉండి, "నేను చూసుకుంటాను" అని బయటికి వెళ్తాడు.

ఇక జ్యోత్స్నతో మాట్లాడుతూ సుమిత్ర చిన్నప్పటి ఒక సంఘటన గుర్తు చేసుకుంటుంది. "చిన్నతనంలో నువ్వు కమలం పువ్వు కోసం కార్తీక్‌ను కోనేటి దగ్గరకు తీసుకెళ్లి ప్రమాదంలో పడేశావు. అప్పుడు ఒక చిన్నారి కార్తీక్‌ను కాపాడింది" అని చెబుతుంది. "నా ప్రాణదాత ఎవరో, నేను కలిశానని" కార్తీక్ బాబు అనడంతో సుమిత్ర సంతోషంతో ఎగిరి గంతులేస్తుంది. కానీ ఆమె ఇంటి పక్కనే ఉన్నారని చెప్పడంతో, కాంచనను కలవాల్సి వస్తుందని బాధపడుతుంది. ఈలోగా జ్యోత్స్న తన తల్లిని కాపాడుకోవాలని, తండ్రితో గొడవ పెట్టాలని ప్లాన్ చేస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్‌లో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+