"వేధింపులు తట్టుకోలేక రాయితో అతడి తల పగలగొట్టా"
ఈవ్ టీజింగ్ అనేది అన్ని చోట్లా పెరిగిపోయింది. స్కూల్, కాలేజీ అమ్మాయిలపై ప్రేమ అంటూ వెంటబడే కుర్రాళ్లను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కొంతమంది సరదాగా ర్యాగింగ్ చేస్తుంటారు. మరికొందరు మాత్రం వెంటబడి మరీ అసభ్యంగా వేధిస్తుంటారు. వాళ్లను ఇబ్బంది పెడుతుంటారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇలాంటి పనులు చేసే ఆకతాయిల ఆకృత్యాలను అరికట్టడానికి పలు చట్టాలు తీసుకొచ్చినా ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే డ్రాగన్, ఫంకీ మూవీస్ యూత్ లో మాంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కయాదు లోహర్ కూ గతంలో ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందట..
ఆమె 16 ఏళ్ల వయసులో జరిగిన ఓ షాకింగ్ ఘటన గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది కయాదు లోహర్. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆమె ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే..? " నాకు అప్పుడు 16 ఏళ్లు ఉంటాయి. టూషన్ కు వెళ్లేదాన్ని. అయితే ఇంటికి దగ్గరే టూషన్ ఉండటంతో నడుచుకుంటూ వెళ్లేదాన్ని. అయితే రోజూ ఓ కుర్రాడు నన్ను ఫాలో అవుతూ వచ్చేవాడు. ఫస్ట్ లో పట్టించుకోలేదు. కానీ అతను హద్దులు దాటి అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో నాకు పట్టలేనంత కోపం వచ్చింది. పక్కనే ఉన్న రాయితో అతని తల మీద విసిరేశాను. దాంతో అతనికి రక్తం కార సాగింది.

దాంతో భయపడిపోయి ఆ కుర్రాడు అక్కడినుంచి పారిపోయాడు. నేను చూడ్డానికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తాను. కానీ నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. ఫ్యూచర్ లోనూ ఇంతే.. ఎవరైనా నాతో అలా అసభ్యకరంగా బిహేవ్ చేస్తే అలాగే ప్రవర్తిస్తాను అని చెప్పుకొచ్చింది. ఇక కయాదు లోహర్ ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని నటించిన ప్యారడైజ్ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ప్యారడైజ్ చిత్రంతో పాటు ఇదయం మురళి, ఇమ్మొర్టల్ వంటి సినిమాల్లోనూ నటిస్తోంది.












Click it and Unblock the Notifications