పెళ్లైన రెండు రోజులకే లిప్‌లాక్‌తో రెచ్చిపోయిన కీర్తి సురేష్
హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి ఘనంగా జరిగింది. డిసెంబర్ 12న(గురువారం) అతి కొద్దిమంది సమక్షంలో కీర్తి సురేష్ వివాహం జరిగింది.తన ప్రియుడు ఆంటోనినే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది. తన 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి కీర్తి సురేష్ సర్ ప్రైజ్ ఇచ్చింది. కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేష్. కొద్ది రోజుల క్రితమే తన ప్రేమికుడు ఆంటోనితో కీర్తి తన లవ్ కన్ఫర్మ్ చేసింది.
గోవాలో డిసెంబర్ 12న మ్యారేజ్ అని కూడా చెప్పారు. డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. పెళ్లికి సంబంధించిన పనులన్నీ కీర్తి సురేష్ దగ్గరుండి చూసుకుంది. అతిథులకి 'KA' అని ముద్రించి ఉన్న హ్యాండ్ బ్యాండ్స్ ఇవ్వడం జరిగింది. వివాహానికి విచ్చేసే అతిథులకు ఏమాత్రం బోర్ కొట్టకుండా ఉండేందుకు వారి గదుల్లో 'వెల్‌కమ్ టు ది వెడ్డింగ్ మ్యాడ్‌నెస్' అనే మ్యాగజైన్స్ ఉంచారు.

మొదట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్, తర్వాత తన భర్త ఆంటోని సంప్రదాయం క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది. ఈ సందర్భంగా భర్తకు లిప్‌లాక్ ఇచ్చింది. కీర్తి సురేష్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సురేష్ పెళ్లి చేసుకోవడంతో సెలబ్రిటీలు ఆమెకు బెస్ట్ విషెష్ చెబుతున్నారు. కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషలు వీరి పెళ్లికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications