కీర్తి సురేష్ తో చిరంజీవి ఇంటిభోజనం తిన్నదంతా కక్కిస్తున్న మెగా ఫ్యాన్స్!!

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు చెబితే ఆయన డాన్స్ కే ఫ్యాన్స్ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో డాన్స్ లో కొత్త ఒరవడిని సృష్టించి ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న యంగ్ హీరోలకు రోల్ మోడల్ గా నిలిచారు. అటువంటి మెగాస్టార్ చిరంజీవిని టాలీవుడ్ జూనియర్ సావిత్రిగా పేరుపొందిన కీర్తి సురేష్ అవమానించారు.

చిరంజీవి ఇంటి భోజనం తిన్న కీర్తి సురేష్
ఇక కీర్తి సురేష్ అవమానం నేపధ్యంలో మెగా ఫ్యాన్స్ అందరినీ తన వాళ్ళు అనుకునే మెగాస్టార్ మంచితనాన్ని తప్పు పడుతున్నారు. రోజు రోజుకూ ఆమెపై మాటల దాడిని పెంచుతున్నారు. భోళా శంకర్ లో చిరంజీవితో పాటు నటించిన కీర్తి సురేష్ ఆ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి ఇంటి నుంచి భోజనం తెప్పించుకొని మరీ తిన్న విషయం అనేక సందర్భాల్లో చిరంజీవి చెప్పారు.

keerthy suresh insulted chiranjeevi fans fires on keerthy suresh and started trolling

కీర్తి సురేష్ వ్యాఖ్యలతో మెగా అభిమానుల ఆవేదన
ప్రతీరోజూ ఆమె కోసం ఒక స్పెషల్ కుక్ ను ఏర్పాటు చేసి మరీ ఆమె చెప్పిన వంటకాలను వండించి భోజనం తీసుకువెళ్ళే వాళ్ళని, కీర్తి సురేష్ చాలా బాగా తన ఫ్యామిలీతో కలిసిపోయింది అని మెగాస్టార్ చెప్పిన విషయాలను గుర్తు చేసుకుని మరీ మెగా ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. చిరంజీవితో చాలా క్లోజ్ గా ఉన్న కీర్తి సురేష్ తాజాగా చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు మెగా ఫాన్స్ ను ఆవేదనకు గురిచేస్తున్నాయి.

మంచితనం అవసరమా సామీ
చిరంజీవిని అంత మాట అంటుందా.. అయినా అందరిమీద మంచితనం అవసరమా సామీ అంటూ మెగాస్టార్ మంచితనంపై చర్చిస్తున్నారు.. ప్రస్తుతం కీర్తి సురేష్ సుహాస్ సరసన ఉప్పుకప్పురంబు అనే సినిమాలో నటిస్తోంది. అలాగే రఘుతాత అనే మూవీలో కూడా నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.15వ తేదీన ధియేటర్ లలో గ్రాండ్ రిలీజ్ అయ్యే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

చిరంజీవిని తక్కువ చేసి మాట్లాడిన కీర్తి సురేష్
ఇక ఇందులో భాగంగా కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి, దళపతి విజయ్ లలో మెగాస్టార్ చిరంజీవి కంటే దళపతి విజయ్ బాగా డ్యాన్స్ చేస్తారని చెప్పి మెగాస్టార్ ను అవమానించారు.
కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో మెగాస్టార్ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. టాలీవుడ్ లోనే మెగా స్టార్ అగ్ర హీరో అయిన చిరంజీవిని తక్కువ చేసి మాట్లాడతారా అంటూ నిప్పులు చెరుగుతున్నారు.

చిరంజీవి మంచితనమే చేటు చేసిందా
డాన్స్ లో గురువుగా భావించే మెగాస్టార్ డాన్స్ నే బాగోలేదని కీర్తి సురేష్ ఇంత మాట అంటుందా అంటూ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మెగాస్టార్ ఇంట ఉప్పు తిన్న విశ్వాసం కూడా నీకు లేదా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. చిరంజీవి మంచితనం అమ్మడికి ఇలా ఏదైనా మాట్లాడొచ్చు అనేలా చేసిందని బాధ పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+