అతన్ని రహస్య వివాహం చేసుకున్న కీర్తి సురేష్..కంగ్రాట్స్ చెప్పిన తల్లి
అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహనటి' సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగేస్తున్నారు.
ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకుపైగానే సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అయితే బాలీవుడ్ ఎంట్రీతో గ్లామర్ హద్దులు చేరిపేసినట్టే కనిపిస్తోంది. రొమాంటిక్ సీన్స్ చేయడానికి కీర్తి సురేష్ గ్రీన్ ఇచ్చిందని తెలుస్తోంది.

కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌ల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. కమెడియన్‌ను కీర్తి సురేష్ రహస్యంగా వివాహం చేసుకుందని ఈ వార్త సారాంశం.
కమెడియన్ సతీష్‌తో కీర్తి సురేష్ పెళ్లి జరిగిపోయిందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తాజాగా కీర్తి సురేష్ పెళ్లిపై తల్లి మేనక స్పందించారు. సతీష్‌తో కీర్తి పెళ్లి జరిగిందన్న రూమర్ విని నేను ఫన్నీగా ఫీల్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చింది. దీనిపై మా కీర్తిని పెళ్లి చేసుకున్నందుకు కంగ్రాట్స్. హ్యాపీగా ఇద్దరూ కాపురం చేసుకోండంటూ సతీష్‌కు కాల్ కూడా చేశానని నా మాటలు విని సతీష్ కూడా నవ్వుకున్నాడని ఆమె చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో భైరవ చిత్ర పూజ కార్యక్రమంలో తీసిందని ఆమె తెలిపింది. భైరవ సినిమాలో విజయ్-కీర్తి సురేష్ జంటగా నటించారు. సతీష్ కమెడియన్ రోల్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ మొదటి రోజు జరిగిన పూజ కార్యక్రమంలో తీసిన ఫొటోనే అది అని కీర్తి తల్లి క్లారిటీ ఇచ్చింది. మరీ ఇప్పటికైనా కీర్తి సురేష్ పెళ్లిపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పెడతారో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications