కేన్స‌ర్‌తో పోరాడుతూ సాయం కోరుతున్న "కేజీఎఫ్" నటుడు..!

ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యష్ హీరోగా వచ్చిన చిత్రం " కేజిఎఫ్ ". ఈ సినిమా రెండు పార్ట్ లు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. అందులో నటించిన నటీనటులకు కూడా మంచి గుర్తింపు లభించింది. అలా కేజిఎఫ్ సినిమాలో చాచా పాత్రతో భారీ పాపులారిటీ అందుకున్న కన్నడ నటుడు హరీష్ రాయ్. ఈయన ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ప్రస్తుతం ఆయన చల్ బలహీనంగా మారిపోయి సాయం చేయమని కోరుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

థైరాయిడ్ క్యాన్సర్..

కాగా హరీష్ రాయ్ థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు చెబుతున్నారు. ఆయన చికిత్సకు రూ.70 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్య బృందాలు తెలిపారట. ఒక్కొక్క ఇంజక్షన్ ఖరీదు రూ.3.5 లక్షలు కాగా.. వైద్యులు 63 రోజుల వ్యవధిలో ఒక సైకిల్ కి మూడు ఇంజక్షన్లు అంటే ఒక్కో సైకిల్ కి రూ.10.5 లక్షలు అవుతుందని సూచించారట. అయితే రోగులకు 17 నుండి 20 ఇంజక్షన్లు అవసరమవుతాయని.. వాటి విలువ సుమారుగా రూ.70 లక్షలు అవుతుందని హరీష్ రాయ్ తెలిపారు.

kgf-actor-harish-roy-suffering-with-cancer-and-need-financial-help

ప్రస్తుతం చికిత్స కోసం ఆర్థిక సహాయం చేయాలి అని కోరుతున్నారు. ఇక ఈ వీడియోలో హరీష్ రాయ్ చాలా బలహీనంగా సన్నగా మారిపోయారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేయగా అందులో ఇన్ఫెక్షన్ సోకి పొట్టలో వాపు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. రాయ్ పరిస్థితి చూసి ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. చికిత్సకు పూర్తి డబ్బు అంది ఆయన ఆరోగ్యంగా కోలుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

ధృవ సర్జ ఆర్థిక సాయం..

కాగా ఈయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. హరీష్ రాయ్ చికిత్సకు ఆసుపత్రి ఖర్చులు భరిస్తానని కన్నడ హీరో ధృవ సర్జ హామీ ఇచ్చినట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు హరీష్ చికిత్సకు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని, ఒక్కో ఇంజక్షన్ కి రూ.3.5 లక్షలు ఖర్చు అవుతుందని సమాచారం. అందులో భాగంగానే ధృవ సర్జ సుమారు రూ.11 లక్షల రూపాయల చెక్కును అందించారట.. ఈ విషయాన్ని ప్రముఖ నటి శశికళ స్పష్టం చేశారు.

మరోవైపు కేజీఎఫ్‌ లో బాంబే డాన్ శెట్టి పాత్రలో నటించిన దినేష్ మంగళూరు రీసెంట్ గానే కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న ఆయన.. గత సోమవారం మృతి చెందారు. దినేష్ కేవలం నటుడిగానే కాకుండా ఆర్ట్ డైరెక్టర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 200లకు పైగా సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసినట్టు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+