బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టుకున్నారు..!
సాధారణంగా ఏ ఇండస్ట్రీలోనైనా మొదట నటుడిగా ఆ తర్వాత విలన్ గా ఆ తర్వాత హీరోగా.. అలా స్టార్ హీరోగా ప్రేక్షకులను అలరించి.. వయసు పెరుగుతున్న సమయంలో మళ్లీ బాబాయ్, తండ్రి, తాతయ్య పాత్రల్లో మెరిసి పరిశ్రమకు ముగింపు పలుకుతారు. మరి కొంతమంది మాత్రం 90 ఏళ్లు వచ్చినా హీరోగానే చేస్తారు. ఇక నట సామ్రాట్, కింగ్ నాగార్జున ఇప్పటికే 99 సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా రాణించి తన సెకండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా ప్రారంభించారు. ఆరు పదుల వయసులోనూ అదే అందం, అదే చిరునవ్వు, అదే చలాకీ తనం ఆయన సొంతం. ఇప్పుడున్న చాలా మంది అప్ కమింగ్ హీరోస్ కంటే కింగ్ నాగార్జున ఎంతో ఫిట్ గా ఉన్నారు. కానీ ఆయన తన ఏజ్ కు తగ్గట్లు పాత్రలు ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఒక శివ లాంటి ఇంటెన్స్ క్యారెక్టర్ అయినా అన్నమయ్య, భక్త రామదాసు, షిర్డి సాయి లాంటి డివోషనల్ పాత్రలైనా సూపర్, కింగ్ లాంటి క్యారెక్టర్స్ అయినా, ఆవిడా మా ఆవిడే, చంద్ర లేఖ లాంటి హుషారెత్తించే పాత్రలైనా ఆయనకే సాటి. కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ చూసిన నాగ్ ఇప్పుడు తన పంథా మార్చుకున్నారు. ఇటీవల కుబేర మూవీలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక లేటెస్ట్ రజనీకాంత్ కూలీ చిత్రంలో అయితే తొలిసారి ఫుల్ లెంగ్త్ విలన్.. అది కూడా ఫుల్ స్టైలిష్, స్మార్ట్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. మూవీ ట్రైలర్ లో అయితే నవ్వుతూనే బయపెడుతున్నారు నాగ్.
కింగ్ నాగార్జున తన నటనలోని మరో కొత్త కోణాన్ని నేటి యంగ్ జనరేషన్ కోసం బయటకు తీశారు. ఏ పాత్రలోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తూ వావ్ అనిపిస్తున్నారు. కూలీ, కుబేర మూవీల్లో ఆయన నటనకు నిదర్శనంగా మారుతున్నాయి. ఇక రానున్న కాలంలో కింగ్ నాగ్.. ఇంకా ఎలాంటి అద్భుతాలు చేస్తారో అని అక్కినేని ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కూలీ ట్రైలర్ రిలీజైన దగ్గర్నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ ను డామినేట్ చేసి మరీ కూలీ మూవీ నాగ్ దే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి మూవీ రిలీజ్ అయ్యాక నాగ్ లోని విలన్ యాంగిల్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండగే అని తెలుస్తోంది.

ఇక కూలీ మూవీ ఆగస్టు 14 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీని తమిళ డైరెక్టర్ లోకేశ్ కనకరాజన్ తెరకెక్కించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications