కోహ్లీ అనుష్క వివాహ వార్షికోత్సవం...అభినందనలు తెలియజేస్తున్న అభిమానులు..
విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు తెలియని వారుండరు. వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటై నేటికి ఆరేళ్లు నిండాయి. దీంతో ఈ జంటకు సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు అభిమానులు. 2017 డిసెంబర్ 11న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి ప్రేమకు ప్రతిరూపంగా 2021 జనవరి 11న వామిక జన్మించింది. ప్రస్తుతం ఈ జోడి పేరు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా నడుస్తోంది.
విరాట్‌కోహ్లీ ప్రపంచ క్రికెట్‌లో తన ఆట, ప్రవర్తనతో ఎనలేని కీర్తిని కైవసం చేసుకున్నాడు. ఇక, అనుష్కశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటనతో బాలీవుడ్‌లో మంచి పేరును సంపాదించుకుంది ఈ అమ్మడు. వీరిద్దరూ వివాహాబంధంతో ఒక్కటై నేటికి ఆరేళ్లు పూర్తయ్యాయి. వీరి ప్రేమ వ్యవహారం 2013 నుంచే మొదలయ్యింది. ఈ మధ్యలో ఎన్నో సమస్యలు, ఆటంకాలతో చివరికి ఈ జంట ఒకటయ్యారు. విరాట్ కోహ్లీ, అనుష్కశర్మలు మొదటిసారిగా 2013లో చేసిన ఓ షాంపు యాడ్‌లో కలుసుకున్నారు.

అప్పటి నుంచి వీరు మంచి స్నేహితులుగా మారారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్తా ప్రేమగా చిగురించింది. దీంతో కొన్నినెలలు ప్రేమలోకంలో విహరించిన ఈ జంట 2017లో పెద్దలను ఒప్పించిం, వారీ అంగీకారంతో డిసెంబర్ 11న పెళ్లి అనేబంధంలో అడుగుపెట్టారు. ఇటలీలో ఎంతో గ్రాండ్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు ఈ జంట. అప్పట్లో వీరి వివాహ ఫోటోలు సోషల్‌మీడియాలో కూడా తెగ వైరల్‌గా మారాయి. వీరి ప్రేమబంధానికి గుర్తుగా వామిక వీరి జీవితంలో అడుగుపెట్టింది.
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెబుతున్న అభిమానులు...
ఇక, నేడు వీరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ జంటకు అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో విరుష్క జంటకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ మరీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పడు వీరి ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇద్దరి అభిమానుల నుంచి నెటిజన్లు కోహ్లీ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఆడే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సైతం ఈ జంటకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపింది. సెలబ్రేటింగ్ ది పర్ఫెక్ట్ పార్ట్‌నర్‌షిప్ అంటూ.. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అంటూ పోస్టును షేర్‌చేసింది. ఇక వీరి అభిమానులు కూడా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు సరదాగా గడిపిన క్షణాల ఫొటోలు, వీడియోలను పంచుకుంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications