మరోసారి కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు ప్రమాదం.. ఈసారి మాత్రం !
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మరోసారి రేసింగ్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బెల్జియంలో ఇటీవల నిర్వహించిన "సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోరాఛాంప్స్" అనే ఇంటర్నేషనల్ రేసింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న అజిత్, ఆ సమయంలో జరిగిన ప్రమాదం నుంచి అద్భుతంగా బయటపడ్డారు. రేసింగ్ ట్రాక్‌పై అజిత్ కారు నియంత్రణ కోల్పోయి ఒక్కసారిగా ట్రాక్ బయటకు దూసుకెళ్లింది. అయితే ఈ ఘటనలో ఆయన సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. అజిత్ కార్ రేసింగ్ లో ప్రమాదానికి గురి కావడం ఇది మూడోసారి.
వరుస ప్రమాదాలు..
'అజిత్ కుమార్ రేసింగ్' పేరుతో ఇటీవలే అజిత్ తన రేసింగ్ టీమ్‌ను ప్రకటించాడు. జనవరిలో జరిగిన '24హెచ్ దుబాయ్' కారు రేసింగ్‌లో అజిత్ టీమ్ మూడో స్థానంలో నిలిచింది. కానీ ఈ రేసింగ్ లోనే అజిత్ వరుసగా ప్రమాదాలకు గురికావడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. దుబాయ్‌లో జరిగిన గ్రాండ్ ప్రీ రేస్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా అజిత్ కారు గోడను బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత స్పెయిన్‌లో జరిగిన మరో రేస్‌లో పక్కనే వస్తున్న మరో కారును తప్పించబోయి పల్టీలు కొట్టింది. ఇప్పుడు జరిగిన ఘటనతో మూడోసారి కూడా ప్రమాదం జరిగినట్టు అయ్యింది. ఈ ప్రమాదాల్లో అజిత్ కు గాయాలు కాకపోవడం ఊరట నిస్తోంది.

ఇక ఇప్పుడు మూడో సారి జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను ఆయన టీమ్ స్వయంగా ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే రేసుల్లో ఇలాంటి ప్రమాదాలు సాధారణమేనని.. ఎవరూ కంగారు పడొద్దని అజిత్ సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక రీసెంట్ గానే అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ అజిత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సినిమాలు ఒకవైపు, రేసింగ్ మరోవైపు... అజిత్ తన ఇష్టాలను, ప్యాషన్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారని అంటున్నారు.
-
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications