ప్రభాస్‌తో పెళ్లి అనుకుంటే మరొకరితో డేటింగ్ చేస్తుందేంటీ..?

ప్రభాస్ పెళ్లి గురించి చాలా ఏళ్ల నుంచి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రతి ఏడాది తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వెళ్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. హీరోయిన్ అనుష్కతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని.. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక వార్తలు తెర మీదకు వచ్చాయి. దీనికి తగ్గట్టే అనుష్క, ప్రభాస్‌ రిలేషన్ ఉన్నట్టు కనిపించారు. బాహుబలి తరువాత అనుష్క సినిమాలకు దూరం ఉంది.

ప్రభాస్‌తో పెళ్లి కోసమే అనుష్క సినిమాలు చేయడం లేదని పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాము మంచి స్నేహితులమని అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని వీరిద్దరు క్లారిటీ ఇవ్వడంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. ఇక ఆదిపురుష్ సినిమా హీరోయిన్ కృతి సనన్‌తో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని గుసగుసలు వినిపించాయి. షూటింగ్‌ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారిందనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఆదిపురుష్ తరువాత వీరిద్దరు క్లోజ్‌గా మూవ్ కావడంతో వీరు ప్రేమ నిజమే అని అనుకున్నారంతా.

Kriti Sanon relation with NRI boyfriend Kabir Bahia

కృతి సనన్‌తో ప్రేమ వ్యవహారం గురించి ప్రభాస్‌నే స్వయంగా ప్రశ్నించారు బాలకృష్ణ. తన అన్‌స్టాప్‌బుల్ షోకు గెస్ట్‌గా వచ్చిన ప్రభాస్‌ను కృతి సనన్‌తో ఎఫైర్ గురించి ప్రభాస్‌ను బాలకృష్ణ నేరుగానే ప్రశ్నించాడు. బాలకృష్ణ ప్రశ్నలకు ప్రభాస్ సమాధానం దాటవేసిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. అటు కృతి సనన్ మనస్సులో ఓ సౌత్ హీరోపై ఉన్నాడని బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సైతం ఓ షోలో చెప్పడం కూడా అప్పట్లో ప్రభాస్‌, కృతి సనన్‌ల బంధం గురించి బాలీవుడ్ మీడియాలో కూడా అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే తాజాగా వీరిందరికి షాకిస్తూ కృతి సనన్‌ మరోకరితో రిలేషన్‌లో ఉన్నట్టు సమాచారం అందుతోంది.

Kriti Sanon relation with NRI boyfriend Kabir Bahia

లండన్‌‌కు చెందిన ఓ కోటీశ్వరుడి కొడుకు కబీర్ బహియా అనే వ్యక్తితో కృతి సనన్‌ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు క్లోజ్‌గా ఉన్న ఫొటోలు కూడా బయటకు రావడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని అందరికి అర్థం అయింది. త్వరలోనే కృతి సనన్‌ కబీర్ బహియాను వివాహం చేసుకోవడానికి కూడా సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఇది తెలుసుకున్న డార్లింగ్ అభిమానులు ప్రభాస్‌తో పెళ్లి అనుకుంటే ఇలా హ్యాండ్ ఇచ్చింది ఏంటని తెగ బాధపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+