ఐ బొమ్మలోకి దూసుకొచ్చిన సూపర్ హిట్ సినిమా
ఐ బొమ్మ అనేది తెలుగు సినిమాలను ఆన్‌లైన్‌లో చూడడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ వెబ్‌సైట్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇది తాజా తెలుగు సినిమాల నుండి క్లాసిక్ హిట్స్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది. అయితే, ఇది చట్టవిరుద్ధమైన వెబ్‌సైట్ అని గమనించాలి. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారిక అనుమతి లేకుండా సినిమాలను ప్రసారం చేస్తుంది.
ఐ బొమ్మ ద్వారా తాజా బ్లాక్ బస్టర్‌లు, క్లాసిక్ హిట్స్, చిన్న సినిమాలు వంటి అన్ని రకాల తెలుగు సినిమాలను ఒకే చోట చూడవచ్చు. దీని ద్వారా ఎటువంటి చెల్లింపులు లేకుండా సినిమాలను ఉచితంగా చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది. సినిమాలను డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో కూడా చూడవచ్చు. తాజాగా ఐ బొమ్మలో సూపర్ హిట్ సినిమా అందుబాటులోకి వచ్చింది.

ఆ సినిమా మరేదో కాదు.. 'లిటిల్ హార్ట్స్'. ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ చిత్రానికి సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. మౌళి తనూజ్, శివాని నగరం, జై కృష్ణ, నిఖిల్ అబ్బూరి ప్రధాన పాత్రలు పోషించారు.
'లిటిల్ హార్ట్స్' సినిమా బడ్జెట్ కేవలం రెండున్నర కోట్ల రూపాయలు. కానీ, ఈ సినిమా థియేటర్ల నుంచి ఏకంగా రూ. 38 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి, ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇది, కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది.
ఈ సినిమా కథాంశం ఒక స్వచ్ఛమైన టీనేజ్ లవ్ స్టోరీ. అఖిల్-కాత్యాయని అనే ఇద్దరు స్టూడెంట్స్ మధ్య నడిచే ఈ ప్రేమకథ, పేరెంట్స్, టీనేజ్ పిల్లలు, చదువులు, ప్రేమలు అనే అంశాల చుట్టూ తిరుగుతుంది.
నిత్యం మనం చూసే విషయాలనే తీసుకుని, వాటిని సరదాగా, భావోద్వేగంగా ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో దర్శకుడు సాయి మార్తాండ్ విజయం సాధించాడు. ఈ తాజాదనం, ప్రేక్షకులకు కథ సులభంగా చేరువకావడమే ఈ సినిమాకు ఇంతటి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ఐ బొమ్మలో కూడా ఈ సినిమా ప్రత్యక్షం అయింది.












Click it and Unblock the Notifications