Lavanya Tripathi పోస్టుపై నెటిజెన్ల కౌంటర్స్..నీకు గొప్పేమో కానీ..!!

Lavanya Tripathi సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఒక్కసారిగా ఒక పోస్ట్‌తో హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఆమె చేసిన పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై పలు కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇంతకీ ఆ పోస్టు ఏంటి.. లావణ్య ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చింది..?

రియాక్ట్ అయిన నెటిజన్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు ఈ మధ్య కవలలకు జన్మనిచ్చారు. అందులో ఒకరు బాబు కాగా మరొకరు పాప అన్న విషయం తెలిసిందే. స్వయంగా మెగాస్టార్ తన ఆనందం అభిమానులతో పంచుకునేందుకు మీడియా సమావేశం సైతం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారసుడొచ్చాడు అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుండగా.. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి కూడా చెబుతూ వారసుడొచ్చాడు అని వెల్లడించారు. చిరంజీవి ప్రెస్‌ మీట్‌లో చెప్పిన ఈ విషయంపై ఒక నెటిజెన్ రియాక్ట్ అయ్యాడు. ఈ జనరేషన్‌లో కూడా వంశాన్ని నడిపించే వారసుడిని కోరుకునే వాళ్లున్నారా అంటూ ఓ వ్యక్తి పోస్టు చేశాడు.

lavanya-tripathi-reacts-strongly-to-heir-comment-on-ram-charan-twins-sparks-online-debate

క్లాస్ పీకిన లావణ్య త్రిపాఠీ

ఆ వ్యక్తి పెట్టిన పోస్టుపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఘాటుగా స్పందించారు. తమ కుటుంబంలో ఆడవారికి ఉన్న ప్రాధాన్యత వేరు అని చెప్పుకొచ్చారు. చిరంజీవి తన మనవరాళ్లను ఎలా చూసుకుంటారో ప్రపంచానికి తెలుసని ఆయన ఆడవాళ్లకు ఇచ్చే గౌరవం ప్రాధాన్యతలో ఇతర మగాళ్లు కనీసం 1శాతం కంటే ఎక్కువగా ఉండరని అన్నారు. ఆనంద క్షణాల్లో మునిగి ఉన్న కుటుంబంలో ఇలాంటి పోస్టులు పెట్టి ఆ సంతోష వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయొద్దని లావణ్య ట్వీట్ చేసిన ఆ వ్యక్తికి కౌంటర్ ఇచ్చింది. సాధారణంగా తాను ఇలాంటి పోస్టులను పట్టించుకోనని చెప్పుకొచ్చిన లావణ్య.. ఆ వ్యక్తి వేసిన పోస్టుకు తప్పని పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నట్లు వివరించారు. చిరంజీవి ఎలా ఉంటారో తెలియనప్పుడు, అనవరసమైన కామెంట్స్ చేయడం సరికాదంటూ క్లాస్ పీకారు.

మీ కుటుంబాన్ని ఎలివేట్ చేసేందుకు...

ఇక లావణ్య త్రిపాఠి అంత సీరియస్‌గా రియాక్ట్ అయ్యే సరికి ఆ పోస్టు చేసిన వ్యక్తి తన పోస్టును డిలీట్ చేశాడు. లావణ్య చేసిన ఈ పోస్టుకు కొందరు పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు మాత్రం ఆమెకు కౌంటర్ ఇస్తున్నారు. "ప్రతి ఒక్కరి గ్రాండ్‌పేరెంట్స్ ఎప్పుడూ బెస్ట్‌గానే ఉంటారు..మీ కుటుంబానికి హైప్ ఇచ్చి ఎలివేట్ చేసేందుకు మీరు చెప్తున్న ఒక్క శాతం మగాళ్లు కూడా ఉండరు అన్న స్టేట్‌మెంట్‌ను విత్ డ్రా చేసుకోవాలి,2026లో మనం ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మేల్కొనండి" అంటూ ఓ నెటిజెన్ ఎక్స్‌లో రిప్లయ్ ఇచ్చాడు.

"ఒక్క శాతం మగాళ్లు మాత్రమే మహిళలంటే గౌరవంతో ఉంటారని నువ్వెలా చెప్పగలుగుతున్నావ్..? నువ్వేమైనా చూశావా..వారి గురించి నీకు తెలియనప్పుడు మీరెలా కామెంట్ చేస్తారు.. అతని ట్వీట్ తప్పయి ఉండొచ్చు.. దాన్ని ఖండించు, కానీ మిగతా మగాళ్లను జడ్జ్ చేయొద్దు"అంటూ మరొక నెటిజెన్ ట్వీట్ చేశారు.

ఒక వారుసుడు కావాలని తన ఇంట్లో తాను లేడీస్ హాస్టల్‌ వార్డెన్‌లా ఉంటున్న ఫీలింగ్ ఉంటుందని చిరంజీవి గతంలో చేసిన వ్యాఖ్యలను పలువురు నెటిజెన్లు గుర్తుచేశారు. చిరంజీవే తన మనసులో మాట బయటపెట్టినప్పుడు..మీరెలా స్టేట్‌మెంట్ ఇస్తారంటూ మరికొందరు నెటిజెన్స్ లావణ్య త్రిపాఠీని ప్రశ్నించారు. మొత్తానికి లావణ్య త్రిపాఠీ చేసిన ఒక్క పోస్టుతో పాజిటివ్ రెస్పాన్స్ కంటే ఆమెను నెగిటివ్‌గా ప్రశ్నించిన వారే చాలా మంది ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+