ఈ తరం హీరోల్లో చిరంజీవికి నచ్చిన ఒకే ఒక హీరో ఇతడే

మెగాస్టార్ చిరంజీవికి ఎంతమంది అభిమానులున్నా, ఆయన కూడా ఎవరో ఒకరికి అభిమానిగా ఉంటారు. కాలానుగుణంగా ఈ అభిమానాలు మారుతూ వస్తుంటాయి. ప్రస్తుతం చిరు అగ్ర హీరో అయిపోవడంతో తర్వాత తరం సినిమాల్లోకి వచ్చింది. తాజాగా మరో యువతరం కూడా ప్రవేశించింది. ఇలా తరానికి ఒకరిని చిరంజీవి అభిమానిస్తూ, తాను అభిమానిగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఇప్పుడున్న యువ హీరోల్లో చిరంజీవికి బాగా నచ్చిన హీరో ఎవరో కాదు.. నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో పాటు విడుదలైన అనగనగా ఒకరోజు సినిమా కూడా సంచలన విజయం సాధించి రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తాను ఈ సినిమా చూసినట్లు చిరంజీవి కూడా చెప్పారు. అంటే చిరుకు నవీన్ అంతగా నచ్చాడు.

చిరంజీవి స్వయంగా చెప్పారు

నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన అనగనగా ఒకరోజు చిత్రం నిర్మించారు. ఈ సినిమాతో మరో భారీ విజయాన్ని నవీన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ చిరంజీవికి నవీన్ ఇష్టమైన నటుడు అని చిరు చెప్పలేదు. దర్శకుడు బాబీ చెప్పాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ వేడుక జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న బాబీ చిరుకు నవీన్ అంటే ఇష్టమని, తనకు స్వయంగా చెప్పారని, ఓ కథ గురించి చర్చించేందుకు వెళ్లగా ఈ విషయాన్ని చెప్పినట్లు బాబీ వెల్లడించారు. ఈ జనరేషన్ లో నాకు నచ్చిన హీరో నవీన్ అని చెప్పినట్లు తెలిపారు. యాక్సిడెంట్ అయినా నొప్పిని పంటి బిగువునా భరిస్తూ సినిమాను పూర్తిచేయడం అతనికున్న నిబద్ధతను తెలియజేస్తోందని ఆ ఫంక్షన్ లో బాబీ కొనియాడారు.

Naveen Polishetty He is the only hero among the current generation of actors that Chiranjeevi likes

సాధారణ సన్నివేశాన్ని కూడా అద్భుతంగా పండిస్తున్నాడు

ఈ తరం హీరోల్లో నవీన్ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లాంటివారున్నప్పటికీ నవీన్ మాత్రమే అంత పెట్ట నటుడికి నచ్చాడంటే కేవలం అతని నటనే కారణం. కామెడీ సన్నివేశాల్లో నవీన్ ను ఈ తరంలో మించిన నటుడు లేడని చెప్పొచ్చు. సాధారణ హాస్య సన్నివేశాన్ని కూడా తన టైమింగ్ తో అద్భుతంగా పండిస్తున్నాడు. దీనివల్ల సాధారణ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్నాయి. కాకపోతే సినిమాలు చాలా ఆలస్యంగా చేస్తున్నాడే పేరుంది. సంవత్సరానికి మూడు సినిమాలైనా చేయాలని నవీన్ పొలిశెట్టి అభిమానులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+