నాతో రొమాన్స్ అంటే అతను భయపడ్డాడు - శృతి హాసన్
హీరోయిన్ శృతి హాసన్ ఇటీవల ఓ వీడియో సాంగ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సాంగ్‌లో తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కానగరాజ్ కూడా నటించారు. ఈ వీడియో సాంగ్‌కు సంబంధించిన ప్రొమో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా దీనికి సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ వీడియోలో లోకేష్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్‌లో లోకేష్ , శ్రుతిహాసన్ రెచ్చిపోయి నటించారు.
వీరి రొమాన్స్ చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. లవ్, రొమాన్స్, పెళ్లి అనే కాన్సెప్ట్‌తో ఈ సాంగ్ తెరకెరకెక్కింది. ఈ వీడియోలో శ్రుతి తన అందాలతో ఆకట్టుకుంది. లోకేష్ కానగరాజ్‌తో , శ్రుతిహాసన్ ఓ రేంజ్‌లో రొమాన్స్ చేసింది. తన అందాల ఆరబోస్తునే.. లోకేష్‌తో కెమిస్ట్రీని అద్భుతంగా పండించింది. ఈ సాంగ్‌లో శ్రుతిహాసన్ తన అందాలతో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సాంగ్ గురించి శ్రుతిహాసన్ మాట్లాడుతూ.. మొదట ఈ సాంగ్‌లో నటించడానికి లోకేష్ కానగరాజ్ ఒప్పుకోలేదు.నాతో రొమాన్స్ అనగానే అతను భయపడ్డాడు. తరువాత ఆయన్ను ఒప్పించి ఈ సాంగ్‌లో నటించేలా చేశామని శ్రుతిహాసన్ తెలిపింది. లోకేష్ కానగరాజ్‌లో దర్శకుడే కాకుండా గొప్ప నటుడు కూడా ఉన్నాడని ఆమె కితాబిచ్చింది. లోకేష్ కానగరాజ్ ప్రస్తుతం రజినీకాంత్‌తో ఓ సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అయితే ఈ గ్యాప్‌లో హీరోయిన్ శృతి హాసన్‌తో కలిసి ఓ సాంగ్‌లో నటించాడు. ఇక శ్రుతిహాసన్ కెరీర్ విషయానికి వస్తే .. ఆమె ప్రస్తుతం సలార్ -2లో నటిస్తోంది. వీరిద్దరు కలిసి నటించిన వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications